Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం 19 మంది సభ్యులతో మొదలు కాగా, ప్రతి వారం ఒక్కో కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. అయితే నామినేషన్స్‌లో ప్రతి సారి ఎక్కువ మంది కంటెస్టెంట్లు ఉండడంతో ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో వారానికి సంబంధించి కాజల్, రవి, సిరి, ఆనీ, ప్రియ, శ్రీరామ్, జస్వంత్‌లు నామినేషన్స్‌లో ఉన్నారు. అలాగే వేటగాళ్లుగా ఉన్న శ్రీరామ్, జస్వంత్‌లు ఒక్కసారి బయటకు రాకపోవడంతో నేరుగా నామినేట్ అయ్యారు. వీరితోపాటు సీక్రెట్ రూంలో ఉన్న లోబో కూడా నామినేట్ అయ్యాడు. దీంతో ఈవారం నామినేషన్స్‌లో 8 మంది నిలిచారు.
ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరు ఆసక్తికరంగా ఎదురు చూడగా, ప్రియ ఈ వారం ఎలిమినేట్ కానుందని ఇన్‌సైడ్ టాక్. చాలా సార్లు ప్రియ ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించినా సేవ్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈవారం ప్రియ ఆంటీని ఎలిమినేట్ చేశారు. అనీ మాస్టర్, లోబోలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్న సమయంలో ప్రియ ఎలిమినేట్ కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
గత శనివారం జరిగిన ఎపిసోడ్‌లో లోబోను సీక్రెట్ రూమ్‌లోకి పంపించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే హోస్ట్ అక్కినేని నాగార్జున.. నువ్వు వచ్చే వారానికి నేరుగా నామినేట్ అయ్యావు అని చెప్పాడు. అంటే.. ఈ వారం జరిగే నామినేషన్స్ టాస్కుతో సంబంధం లేకుండానే అతడు ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లాడు. అతను ఎలిమినేట్ అవుతాడని అందరు అనుకున్నారు. కానీ ఈ సారి కూడా బతికి బట్టకట్టాడు. బిగ్ బాస్ అంటేనే కన్ఫ్యూజన్. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఈ సారి ఎలిమినేషన్‌లోనూ అదే జరిగింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…