Bhimla Nayak : ఆర్ఆర్ఆర్ దెబ్బ‌కు భీమ్లా నాయ‌క్ కూడా వాయిదా ప‌డిందా.. సాక్ష్యం ఇదే..!

November 4, 2021 1:07 PM

Bhimla Nayak : వ‌చ్చే ఏడాది సంక్రాంతి రేసులో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు అగ్రనటులు మహేశ్​ బాబు, పవన్​ కల్యాణ్ రెడీ అయ్యారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా.. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాను వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఆ చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక పవన్‌కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ సినిమాను 2022, జనవరి 12వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఆ సినిమా యూనిట్ కూడా ప్రకటనను విడుదల చేసింది.

Bhimla Nayak release date may be postponed because of rrr movie

ఈ క్ర‌మంలో ప్ర‌మోష‌న్స్ ను కూడా షురూ చేశారు. కానీ రాజ‌మౌళి ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌య్యారో దాంతో లెక్క‌లు అన్నీ మారిపోయాయి. స‌ర్కారు వారి పాట చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇక తాజాగా లాలా భీమ్లా ప్రోమో రిలీజ్ ప్రకటన పోస్టర్ లో విడుదల తేదీగా జనవరి 12 ముద్రించారు. దీంతో సినిమా వాయిదా ప‌డ‌ద‌ని అనుకున్నారు.

కానీ తాజాగా దీపావ‌ళి విషెస్ తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. ఇందులో రిలీజ్ డేట్ లేపేశారు. దీంతో అభిమానుల‌లో భీమ్లా నాయ‌క్ రిలీజ్ డేట్ పై అనుమానాలు నెల‌కొన్నాయి. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’​కు రీమేక్​ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ స్క్రీన్​ప్లే అందిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now