Bhimla Nayak : ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్న ప‌ర్‌ఫెక్ట్ పిక్చ‌ర్.. ఇద్దరూ ఒకే ఫ్రేములో అదిరిపోయారు..!

October 21, 2021 10:55 PM

Bhimla Nayak : రాజ‌కీయాల వ‌ల‌న సినిమాల‌కు దూరంగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొద్ది రోజుల త‌ర్వాత వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో మ‌ల‌యాళ చిత్రం రీమేక్‌గా భీమ్లా నాయ‌క్ అనే సినిమా చేస్తున్నారు. అయ్యప్పనుమ్ కోషియం మూవీ ఆధిపత్యం కోసం ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే పోరుతో తెరకెక్కింది. ఇందులో బీజూ మీనన్ ఎస్సైగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ లోకల్ డాన్‌గా నటించారు.

Bhimla Nayak pawan kalyan and rana appeared in one frame

తెలుగులో ఈ చిత్రం రీమేక్ అవుతుండ‌గా.. భీమ్లా నాయ‌క్ అనే పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ప‌వ‌న్‌, డానియల్ శేఖ‌ర్ అనే లోక‌ల్ డాన్ పాత్ర‌లో రానా క‌నిపించ‌నున్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘భీమ్లా నాయక్’ యూనిట్ టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఈ పాట ఫ్యాన్స్‌కు పూనకాలను తెప్పించింది ఇక డానియ‌ల్ శేఖ‌ర్ కి సంబంధించిన వీడియో కూడా విడుద‌ల కాగా, ఇది ఫ్యాన్స్‌కి మాంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ను అందించింది.

ఇప్ప‌టి వ‌ర‌కు విడివిడిగా పోస్ట‌ర్స్, వీడియోలను విడుద‌ల చేసిన మేక‌ర్స్ తొలిసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా క‌లిసి ఉన్న పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. మంచం పైన ప‌వ‌న్ ప‌డుకొని ఉండ‌గా, రానా ఎడ్ల బండిపై మాస్ లుక్ లో క‌నిపించారు. ఈ ఇద్ద‌రు క‌లిస్తే బాక్సాఫీస్ షేక్ కావ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. పోస్ట‌ర్ మాత్రం ఫ్యాన్స్ అంచ‌నాలను పీక్స్‌లోకి తీసుకెళ్లింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment