Bhimla Nayak : నిత్యా మీనన్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆమె పవన్‌కు భార్యగా నటిస్తోంది. అయితే ఆమెకు చెందిన సినిమాలోని పాత్ర గ్లింప్స్‌ను మేకర్స్ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. కానీ తాజాగా నిత్య, పవన్ నటించిన ఓ సాంగ్‌ను మాత్రం రిలీజ్ చేశారు. దీంతో నిత్య భిన్నమైన లుక్‌లో ఈ మూవీలో కనిపించనున్నట్లు అర్థమవుతోంది.
ఇక పవన్‌తో షూటింగ్ చేయడంపై నిత్యా మీనన్ స్పందించింది. ఈ మూవీలో తన క్యారెక్టర్ ఒరిజినల్ వెర్షన్ క్యారెక్టర్ కన్నా భిన్నంగా ఉంటుందని తెలిపింది. ఒరిజినల్ చిత్రంలో రోల్ చిన్నదని, కానీ ఈ మూవీలో తన పాత్ర నిడివిని పెంచారని, తాను ఈ చిత్రంలో తన భర్తను కమాండింగ్ చేసే మహిళలా కనిపిస్తానని తెలిపింది.
త్రివిక్రమ్‌తో వర్క్ చేయడం చాలా ఇష్టపడతానని నిత్య చెప్పుకొచ్చింది. తాను ఇప్పటి వరకు పవన్‌తో కేవలం 4-5 రోజులు మాత్రమే షూటింగ్ చేశానని, అయినప్పటికీ ఎంతో మధురానుభూతి కలిగిందని తెలిపంది. పవన్ చాలా ప్రశాంతంగా ఉంటారని, నెమ్మదస్తులని తెలిసింది. ఆయనతో పనిచేయడం సాలా సులభమని చెప్పింది.
ఇక భీమ్లా నాయక్‌లో రానా కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. మళయాళం సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్‌కు రీమేక్‌గా భీమ్లా నాయక్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని 2022 జనవరి 12వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…