Bhimla Nayak : భారతీయ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. నిన్న మొన్నటి వరకు అంతా బాగానే ఉంది, ఇక సినిమాలను థియేటర్లలో రన్ చేసుకోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆశపడ్డాయి. కానీ వారి ఆశలు అడియాశలే అవుతున్నాయి. కరోనా కారణంగా అనేక సినిమాలను వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఇక కొందరు హీరోల సినిమాలు అయితే నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి.
సంక్రాంతి బరిలో నిలిచిన భీమ్లా నాయక్ చిత్రాన్ని వాయిదా వేసే ప్రసక్తే లేదని గతంలో చిత్ర యూనిట్ తెలిపింది. అయితే అదే సమయంలో ఆర్ఆర్ఆర్ మూవీ ఉండడంతో వారి కోరిక మేరకు భీమ్లా నాయక్‌ను వాయిదా వేశారు. దీంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే అప్పటి వరకు పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది. కనుక చిత్రాన్ని విడుదల చేసి నష్టాలు కొనితెచ్చుకోవడం కంటే.. వాయిదా వేయడమే మేలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే భీమ్లా నాయక్ విడుదలను మళ్లీ వాయిదా వేయాలని చూస్తున్నట్లు సమాచారం. దీనిపై నేడో, రేపో అధికారిక ప్రకటన చేస్తారని కూడా సమాచారం అందుతోంది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కల్యాణ్, రానా, నిత్య మీనన్ కీలకపాత్రల్లో నటించారు. సాగర చంద్ర ఈ మూవీకి దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్‌కు సన్నిహితుడు కనుక ఈ సినిమాను దగ్గరుండి చూసుకున్నారు. దీంతో వారి కాంబినేషన్‌లో మళ్లీ ఈ మూవీ హిట్ అవుతుందని భావిస్తున్నారు. భీమ్లా నాయక్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. మళయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్‌కు రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…