గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Bhimla Nayak : ప‌వ‌న్ అభిమానుల‌కు మ‌ళ్లీ బ్యాడ్ న్యూస్‌.. భీమ్లా నాయ‌క్ విడుద‌ల మ‌ళ్లీ వాయిదా..?

Bhimla Nayak : భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌స్తుతం చాలా గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అంతా బాగానే ఉంది, ఇక సినిమాల‌ను థియేట‌ర్ల‌లో ర‌న్ చేసుకోవ‌చ్చ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఎంతో ఆశ‌ప‌డ్డాయి. కానీ వారి…

Bhimla Nayak : ప‌వ‌న్ అభిమానుల‌కు మ‌ళ్లీ బ్యాడ్ న్యూస్‌.. భీమ్లా నాయ‌క్ విడుద‌ల మ‌ళ్లీ వాయిదా..?

Bhimla Nayak : భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌స్తుతం చాలా గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అంతా బాగానే ఉంది, ఇక సినిమాల‌ను థియేట‌ర్ల‌లో ర‌న్ చేసుకోవ‌చ్చ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఎంతో ఆశ‌ప‌డ్డాయి. కానీ వారి ఆశ‌లు అడియాశ‌లే అవుతున్నాయి. క‌రోనా కార‌ణంగా అనేక సినిమాల‌ను వాయిదా వేసుకోవాల్సి వ‌స్తోంది. ఇక కొంద‌రు హీరోల సినిమాలు అయితే నేరుగా ఓటీటీలోనే విడుద‌లవుతున్నాయి.

Bhimla Nayak bad news for pawan kalyan fans movie may be postponed again
Bhimla Nayak Rana Pawan Kalyan

సంక్రాంతి బరిలో నిలిచిన భీమ్లా నాయ‌క్ చిత్రాన్ని వాయిదా వేసే ప్ర‌స‌క్తే లేద‌ని గ‌తంలో చిత్ర యూనిట్ తెలిపింది. అయితే అదే స‌మ‌యంలో ఆర్ఆర్ఆర్ మూవీ ఉండ‌డంతో వారి కోరిక మేర‌కు భీమ్లా నాయ‌క్‌ను వాయిదా వేశారు. దీంతో ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే అప్ప‌టి వ‌ర‌కు ప‌రిస్థితుల్లో పెద్ద‌గా మార్పు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. క‌నుక చిత్రాన్ని విడుద‌ల చేసి న‌ష్టాలు కొనితెచ్చుకోవ‌డం కంటే.. వాయిదా వేయ‌డ‌మే మేల‌ని చిత్ర యూనిట్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుక‌నే భీమ్లా నాయ‌క్ విడుద‌ల‌ను మ‌ళ్లీ వాయిదా వేయాల‌ని చూస్తున్న‌ట్లు స‌మాచారం. దీనిపై నేడో, రేపో అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తార‌ని కూడా స‌మాచారం అందుతోంది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 1వ తేదీన విడుద‌ల చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Bhimla Nayak : ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు..

భీమ్లా నాయ‌క్ చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రానా, నిత్య మీన‌న్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. సాగ‌ర చంద్ర ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాటలు అందించారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ప‌వ‌న్‌కు స‌న్నిహితుడు క‌నుక ఈ సినిమాను ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. దీంతో వారి కాంబినేష‌న్‌లో మ‌ళ్లీ ఈ మూవీ హిట్ అవుతుంద‌ని భావిస్తున్నారు. భీమ్లా నాయ‌క్‌ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. మ‌ళ‌యాళ సినిమా అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌కు రీమేక్‌గా దీన్ని తెర‌కెక్కించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి