Bhagyashree : భాగ్య శ్రీ సినిమాల నుండి లాంగ్ బ్రేక్ తీసుకోవడానికి కార‌ణం ఇదే..!

November 8, 2021 1:50 PM

Bhagyashree : బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన భాగ్యశ్రీ ఫస్ట్ సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. 1989 లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన మైనే ప్యార్ కియా సినిమాతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా కంగనా రనౌత్ నటించిన తలైవి సినిమాతో భాగ్యశ్రీ రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో భాగ్యశ్రీ కీలక పాత్ర పోషిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డె. రీసెంట్ గా భాగ్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Bhagyashree told why she took long break from movies

ఈ ఇంటర్వూలో తాను సినిమాల నుండి ఎక్కువగా విరామం తీసుకోవడానికి కారణాలేంటో వివరించారు. భాగ్యశ్రీ ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదని.. చాలా బాధపడ్డానని, ముఖ్యంగా తన కుడి చేయి కదలడం కష్టంగా ఉండేదని అందుకే సినిమాలకు బ్రేక్ ఇచ్చానని అన్నారు. భాగ్యశ్రీ తన ఆరోగ్యం నుండి కోలుకోవడానికి ఒక సంవత్సర కాలం పట్టిందని అన్నారు. ఈ క్రమంలో ఆమె పోషకాహారం, ఫిట్ నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేందుకు సమయాన్ని వినియోగించుకున్నానని భాగ్య శ్రీ తెలిపారు.

అలాగే తన ఆరోగ్యం బాగుండేందుకు సర్జరీల్లాంటివి సెలెక్ట్ చేసుకోలేదని, అందుకు బదులుగా తన కష్టపడి పనిచేసి సొంతంగా ట్రీట్ మెంట్ తీసుకోవడంతో కోలుకున్నట్లు తెలిపారు. ఆ టైమ్ లో ఓ టెలివిజన్ షోకి సంబంధించిన ప్రోగ్రామ్ లో తన కుడి చేతిని కదపలేకపోయానని, అలా తను కోలుకోవడానికి సంవత్సరం పట్టిందని అన్నారు. సాధారణమైన జీవన విధానం అనేది మనిషిని క్యూర్ చేయడాన్ని తాను దగ్గరుండి తెలుసుకున్నానని అన్నారు. ఆమె ప్రస్తుతం నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now