Bhagyashree : త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న నటి భాగ్యశ్రీ కుమార్తె..!

November 12, 2021 5:11 PM

Bhagyashree : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వారసులు, వారసురాలు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం. ఇప్పటికే ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి తమదైన శైలిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే త్వరలో మరొక వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోందని తెలుస్తోంది. గత కొన్ని దశాబ్దాల కిందట ప్రేమ పావురాలు (హిందీలో మైనే ప్యార్ కియా) అనే సినిమాతో తెలుగు ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్న నటి భాగ్యశ్రీ చాలా రోజుల తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

Bhagyashree daughter avanthika soon to enter into film industry

ఈ క్రమంలోనే ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ తల్లి పాత్రలో నటిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ గతంలో తాను చేసిన పొరపాటును తన కూతురు విషయంలో చేయనని అందుకే తన కూతురిని మొట్టమొదటిసారిగా తెలుగు తెరకు పరిచయం చేయాలనుకుంటున్నానని తెలియజేశారు. ఈ క్రమంలోనే తన కూతురు అవంతికను బడా ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ద్వారా పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.

తన కూతురిని తెలుగు తెరకు పరిచయం చేయడానికి పూర్తిగా రంగంలోకి దిగిన భాగ్యశ్రీ తానే కథను విని ఎంపిక చేసినట్లు సమాచారం. చాలామంది బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఒకప్పుడు తెలుగులో వారి సినీ కెరీర్ ని మొదలు పెట్టి అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న నేపథ్యంలో భాగ్యశ్రీ కూడా తన కూతురును మొదటి సారిగా తెలుగు తెరకు పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now