శనివారం, జూన్ 13, 2026
ఆరోగ్యం

Beetroot Juice : రోజూ దీన్ని తీసుకుంటే చాలు.. హైబీపీ అన్న‌ది అస‌లే ఉండ‌దు..!

Beetroot Juice : అనారోగ్యకరమైన జీవనశైలి, అధిక ఒత్తిడి వల్ల వచ్చే ప్రధాన వ్యాధులలో అధిక రక్తపోటు ఒకటి. దీనిని నిర్లక్ష్యం చేస్తే.. గుండె సమస్యలు, ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రక్తపోటును నియంత్రణలో…

Beetroot Juice : రోజూ దీన్ని తీసుకుంటే చాలు.. హైబీపీ అన్న‌ది అస‌లే ఉండ‌దు..!

Beetroot Juice : అనారోగ్యకరమైన జీవనశైలి, అధిక ఒత్తిడి వల్ల వచ్చే ప్రధాన వ్యాధులలో అధిక రక్తపోటు ఒకటి. దీనిని నిర్లక్ష్యం చేస్తే.. గుండె సమస్యలు, ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తపోటు ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ రక్తపోటును నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా చెప్పవచ్చు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు బీట్ రూట్ జ్యూస్ తాగితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. బీట్‌రూట్ సహజమైన నైట్రేట్‌లను కలిగి ఉంటుంది.

ఇది శరీరంలోకి వెళ్లి నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతుంది. దాని సహాయంతో రక్తాన్ని సరఫరా చేసే నాళాలు రిలాక్స్ అయ్యి రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. బీట్ రూట్ లో ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్ సి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. బీట్‌రూట్‌లో ఉన్న నైట్రేట్‌లు రక్త నాళాలను తెరుచుకునేలా చేస్తాయి. ఇది రక్త ప్రవాహానికి సహాయపడి అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. బీట్‌రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తాయి, అలాగే బి విటమిన్లు నరాల పనితీరును మెరుగుపరుస్తాయి.

Beetroot Juice daily on empty stomach best for high bp
Beetroot Juice

ఇది బలమైన హృదయ స్పందనను నిర్వహించడానికి సహాయపడుతుంది. అంతేకాక ఇనుము, యాంటీఆక్సిడెంట్ల కలయిక రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. దాంతో ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది. బీట్ రూట్ జ్యూస్ ఏ సమయంలో తాగితే మంచిది అనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి.

బీట్ రూట్ జ్యూస్ ని రోజులో ఏ సమయంలోనైనా తాగవచ్చు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం ఖాళీ కడుపుతో లేదా బ్రేక్ ఫాస్ట్ కి గంట ముందు బీట్ జ్యూస్ తాగడం వల్ల పూర్తి ప్రయోజనం పొందవచ్చు. ఉదయం సమయంలో తాగటం వలన రోజంతా అలసట, నీరసం లేకుండా హుషారుగా ఉంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి