Nagarjuna : మల్టీస్టారర్ సినిమా అన్నప్పుడు డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కొంచెం తేడా కొట్టిన అభిమానులు హర్ట్ అవుతారు. రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే జరిగింది. రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువగా ఉంది. పాత్రకు ప్రాధాన్యత కూడా తక్కువ ఉందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శకుడు రాజమౌళి పై ట్రోల్స్ కూడా చేశారు. కొంతమంది అయితే ఏకంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు నెగిటివ్ ప్రచారం కూడా మొదలు పెట్టారు. అయితే ఇలాంటి గొడవలు ఇప్పుడే కాదు.. ఒకప్పుడు కూడా జరిగాయి.
సూపర్ స్టార్ కృష్ణ నాగార్జున హీరోలుగా వారసుడు అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి మురళీమోహన్ నిర్మాతగా వ్యవహరించారు. కాగా ఈ సినిమా సమయంలో జరిగిన ఓ గొడవ గురించి మురళీమోహన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వారసుడు సినిమాలో ఒక సందర్భంలో కృష్ణ నాగార్జునతో నువ్వెంత అంటూ వాదించడం జరుగుతుంది. ఆ సీన్లో నాగార్జున కృష్ణను పట్టుకుని వాదిస్తూ మాట్లాడతారని తెలిపారు.
అయితే ఈ సన్నివేశం కారణంగా సినిమా విడుదలైన తర్వాత కృష్ణ అభిమానులు తనతో గొడవ పడ్డారని తెలిపారు. సినిమాలోని తన పాత్ర నచ్చడంతో కృష్ణ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. అంతేకాకుండా కృష్ణ గొప్ప మనసున్న హీరో అని తెలిపారు. సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతలను ఆదుకునే విషయంలో కృష్ణ అందరి కంటే ముందు ఉంటానని చెప్పారు. నిర్మాత దగ్గర డబ్బులు లేకపోయినా కృష్ణ అండగా నిలబడి సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని మురళీమోహన్ తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…