Bangarraju Movie : ఓటీటీలో స్ట్రీమ్ కానున్న బంగార్రాజు మూవీ.. ఎందులో అంటే..?

February 9, 2022 10:11 PM

Bangarraju Movie : అక్కినేని నాగార్జున‌, అక్కినేని నాగ‌చైత‌న్య‌లు క‌లిసి న‌టించిన మూవీ.. బంగార్రాజు. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌నే రాబ‌ట్టింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఫ్యాంటసీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ బాగానే ల‌భించింది. ఇక ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమ్ చేయ‌నున్నారు.

Bangarraju Movie to stream on OTT know the app
Bangarraju Movie

ప్ర‌ముఖ ఓటీటీ యాప్ జీ5 బంగార్రాజు మూవీకి గాను డిజిట‌ల్ హ‌క్కుల‌ను క‌లిగి ఉంది. అందువ‌ల్ల ఆ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది. ఫిబ్ర‌వ‌రి 18, 2022వ తేదీన ఈ మూవీని ఆ యాప్‌లో స్ట్రీమ్ చేయ‌నున్నారు. జీస్టూడియోస్‌, అన్న‌పూర్ణ స్టూడియోస్ ప‌తాకాల‌పై సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. అందుక‌నే జీ5 యాప్‌లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఈ మూవీకి క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఇందులో నాగార్జున ప‌క్క‌న ర‌మ్య‌కృష్ణ‌, నాగ‌చైత‌న్య ప‌క్క‌న కృతి శెట్టిలు హీరోయిన్లుగా న‌టించారు. ఇక ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now