Bangarraju Movie : సంక్రాంతి బ‌రిలో బంగార్రాజు.. జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు..

January 5, 2022 7:54 PM

Bangarraju Movie : క‌రోనా నేప‌థ్యంలో భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను వాయిదా వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా విడుద‌ల చేస్తార‌నుకున్న ఆర్ఆర్ఆర్‌, రాధే శ్యామ్ మూవీల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. గ‌త 2 రోజులుగా సంక్రాంతి బ‌రిలో ఉంటున్న మూవీల జాబితా త‌గ్గుతూ వ‌స్తోంది. అయితే కింగ్ నాగార్జున‌, ఆయ‌న త‌న‌యుడు నాగ‌చైత‌న్య న‌టించిన బంగార్రాజు మూవీని మాత్రం సంక్రాంతికే విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు.

Bangarraju Movie to release on January 14th for pongal

క‌రోనా నేప‌థ్యంలో సినిమాల‌న్నీ వాయిదా ప‌డుతున్నాయి క‌నుక బంగార్రాజు మూవీని కూడా వాయిదా వేస్తార‌ని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 14న అంటే సంక్రాంతి రోజున విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించేసింది. దీంతో ప్రేక్ష‌కులు కొంత వ‌రకు రిలీఫ్ ఫీల‌వుతున్నారు.

తాము ఎంతో ఆశ‌గా ఎదురు చూసిన భారీ బ‌డ్జెట్ మూవీల విడుద‌ల లేక‌పోయినా.. నాగార్జున సినిమా అంటే.. మినిమం ఎంట‌ర్‌టైన్‌మెంట్ గ్యారంటీ క‌నుక ప్రేక్ష‌కులు కొంత వ‌రకు ఊర‌ట చెందుతున్నారు. అయిన‌ప్ప‌టికీ భారీ బ‌డ్జెట్ మూవీలు ఇప్పుడ‌ప్పుడే విడుద‌ల కావ‌డం లేదు క‌నుక ప్రేక్ష‌కుల‌కు నిరాశ త‌ప్ప‌డం లేదు.

ఇక బంగార్రాజు మూవీలో నాగ్ స‌ర‌స‌న ర‌మ్య కృష్ణ న‌టించ‌గా.. చైతూ ప‌క్క‌న కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. ఫ‌రియా అబ్దుల్లా ఈ మూవీలో ప్ర‌త్యేక పాట‌లో న‌టించింది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. 2016 సంక్రాంతి బరిలో ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన సోగ్గాడే చిన్ని నాయ‌నా మూవీ భారీ హిట్ సాధించింది. దీంతో 2022లోనూ బంగార్రాజు అదే మ్యాజిక్ చేస్తాడ‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now