Bandla Ganesh : సంచలనంగా మారిన బండ్ల గణేష్ ట్వీట్.. నువ్వు తోపు అన్నా..!

October 25, 2022 3:22 PM

Bandla Ganesh : టాలీవుడ్ ప్రముఖ నటుడు, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో బండ్ల యమ స్పీడ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అంశాలపై స్పందిస్తూ.. ట్వీట్లు, పోస్టులు పెడుతుంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ ఆయనపై పెట్టిన పోస్టులతో బండ్ల ఎప్పుడూ హైలెట్ అవుతుంటాడు. బండ్ల గణేష్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా దీపావళి సందర్భంగా బండ్ల గణేష్ వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. బండ్ల గణేష్ భారీ మొత్తంలో బాణాసంచా సామాగ్రి కొనుగోలు చేశాడు.

తాను కొన్న దీపావళి టపాసులను ఇంటి ముందు పేర్చి కుటుంబ సభ్యులతో పాటు ఫోటో దిగారు. సదరు ఫోటో ట్వీట్ చేసిన బండ్ల గణేష్ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద మొత్తంలో ఉన్న బాణాసంచా చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ఇన్ని టపాసులు మీ కుటుంబం కోసమేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక బండ్ల గణేష్ కొన్న ఆ టపాసుల విలువ దాదాపు రూ. 4 లక్షలు. అయితే ఆయన కొనుగోలు చేసిన ఈ పటాసులు మొత్తం తమ కుటుంబం కోసం కాదట.

Bandla Ganesh sensational tweet on diwali
Bandla Ganesh

వాటిలో కొన్ని సన్నిహితులకు, చుట్టుపక్కల జనాలకు పంచుతారని సమాచారం. ప్రతి ఏడాది బండ్ల గణేష్ ఇలాగే భారీగా బాణాసంచా కొనుగోలు చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు బండ్ల గణేష్ ట్వీట్ వైరల్ చేస్తున్నారు. పవన్ డై హార్డ్ ఫ్యాన్ అయిన బండ్ల గణేష్ ని పవన్ అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు. దీపావళి వేడుకలు కోసం భారీగా బాణాసంచా కొనుగోలు చేసిన బండ్లను నువ్వు తోపు అంటూ కొనియాడుతున్నారు. పవన్ కళ్యాణ్ మరో అవకాశం ఇస్తే ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తానని బండ్ల గణేష్ అంటున్నాడు. చూడాలి పవన్ బండ్లకు మరో అవకాశం ఇస్తాడో లేదో..

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now