Bandla Ganesh : పూరీ జ‌గ‌న్నాథ్‌పై బండ్ల గ‌ణేష్ మ‌ళ్లీ సంచ‌ల‌న కామెంట్స్‌.. ఈసారి ఏమ‌న్నారంటే..?

September 30, 2022 9:35 PM

Bandla Ganesh : వివాదాస్ప‌ద కామెంట్లు చేయ‌డంలో బండ్ల గ‌ణేష్ అంద‌రి క‌న్నా ఒక మెట్టుపైనే ఉంటారు. ఆయ‌న చేసే కామెంట్స్ త‌ర‌చూ వివాదాల‌కు కార‌ణ‌మ‌వుతుంటాయి. ఆయ‌న ఒక సినిమా ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ ను బాధ పెట్టేలా కామెంట్లు చేశారు. దీంతో అప్ప‌ట్లో గ‌ణేష్ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అయ్యాయి. ఆ సమయంలో బండ్ల గణేష్ కామెంట్లకు పూరీ జగన్నాథ్ నుంచి ఘాటైన కౌంటర్ వచ్చింది. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరీ జగన్నాథ్ పై బండ్ల గణేష్ మరోమారు షాకింగ్ కామెంట్లు చేశారు. దీంతో మ‌ళ్లీ ఆయ‌న వార్త‌ల్లో నిలిచారు.

బండ్ల గ‌ణేష్ యూట్యూబ్ చాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. భార్యా బిడ్డలను ప్రేమించనోడు మనిషా అంటూ కామెంట్లు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాలను ఎందుకు కెలుకుతున్నారనే ప్రశ్నకు.. బండ్ల‌.. ఎక్కడ కెలికానని సమాధానమిచ్చారు. ఇక పూరీ జగన్నాథ్ అనే వ్యక్తికి మంచి, చెడు చెప్పే హక్కు నాకు ఉందని బండ్ల గణేష్ కామెంట్లు చేశారు. పూరీ జగన్నాథ్ నా ఫ్రెండ్ అని బండ్ల గణేష్ వెల్లడించారు. ఈ క్ర‌మంలోనే బండ్ల గ‌ణేష్ చేసిన కామెంట్స్ సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.

Bandla Ganesh sensational comments yet again on Puri Jagannadh
Bandla Ganesh

అయితే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో బండ్ల గణేష్ నిర్మాతగా పలు సినిమాలు తెరకెక్కాయి. ఈ కాంబినేషన్ లో వచ్చిన ఇద్దరమ్మాయిలతో మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సాధించలేదు. కానీ టెంపర్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ త‌రువాత బండ్ల గణేష్ సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్నారు. అయితే తాజాగా బండ్ల గ‌ణేష్.. పూరీ జ‌గ‌న్నాథ్ పై చేసిన కామెంట్స్ సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మ‌రి దీనికి పూరీ మ‌ళ్లీ స్పందిస్తారేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now