Bandla Ganesh : రాజ‌కీయాల్లోకి బండ్ల గ‌ణేష్ రీ ఎంట్రీ..? రాకుండా ఎవ‌రు ఆపుతున్నారు ?

October 14, 2021 10:17 PM

Bandla Ganesh : నిర్మాత బండ్ల గ‌ణేష్ ఎప్పుడూ ఏవో వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలుస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. అయితే ఈసారి ఆయ‌న రాజకీయాల‌పై వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. రాజ‌కీయాల్లో త‌న రీ ఎంట్రీపై ఆయ‌న ఈసారి స్ప‌ష్ట‌త‌ను ఇచ్చారు.

Bandla Ganesh important comments on his political re entry

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి షాద్‌న‌గ‌ర్‌లో ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఆ కార్య‌క్ర‌మానికి బండ్ల గ‌ణేష్, ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు కూడా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా సీనియ‌ర్ కాంగ్రెస్ నాయకుడు మ‌ల్లు ర‌వి.. బండ్ల గ‌ణేష్‌ను రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాల‌ని కోరారు. అయితే అందుకు బండ్ల గ‌ణేష్ స్పందించారు.

రాజ‌కీయాల్లోకి మ‌ళ్లీ వ‌చ్చి తెలంగాణ కాంగ్రెస్‌కు సేవ‌లు అందించాల‌ని మ‌ల్లు ర‌వి కోర‌గా.. అందుకు బండ్ల గ‌ణేష్ స్పందిస్తూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను త‌ప్ప‌క రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే రేవంత్‌ ఆహ్వానించినా.. బండ్ల వస్తారా, రారా.. అన్నది సందేహమే. తన రాకను ఎవరో అడ్డుకుంటారని బండ్లకు నమ్మకం. అందుకనే కాబోలు.. అప్ప‌ట్లో బండ్ల గ‌ణేష్ రాజ‌కీయాల్లో నుంచి అనూహ్యంగా త‌ప్పుకున్నారు. అందుకు అప్పట్లో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే కార‌ణం అని చెప్పవచ్చు.

అయితే బండ్ల గ‌ణేష్ కాంగ్రెస్‌లో తిరిగి చేరి సేవ‌లు అందిస్తే ఆయ‌న‌కు ఎమ్మెల్యే టిక్కెట్ రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కానీ తెలంగాణ‌లో ప్ర‌స్తుతం కాంగ్రెస్ ఉన్న ప‌రిస్థితి దృష్ట్యా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గ‌ట్టెక్కుతుందా ? అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. పీసీసీ చీఫ్‌గా రేవంత్ వ‌చ్చాక కాంగ్రెస్ పార్టీలో కొంత జోరు పెరిగింది. మ‌రి ఎన్నిక‌ల వ‌ర‌కు ఆ జోరు ఉంటుందా, లేదా అన్న‌ది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now