Balakrishna : దటీజ్‌ బాలయ్య.. షూటింగ్‌లో గాయపడ్డా.. పనిపూర్తి చేశారు..!

October 9, 2021 1:11 PM

Balakrishna : టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన స్టార్స్ ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస‌గా ఆసుప‌త్రుల చుట్టూ తిరుగుతున్నారు. సాయి ధ‌ర‌మ్ తేజ్, అడివి శేష్‌, సిద్ధార్థ్ , రామ్ ఇలా ప‌లువురు ప‌లు కార‌ణాల వ‌ల‌న ఆస్ప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు బాల‌కృష్ణ కూడా గాయం కార‌ణంగా ఆసుప‌త్రికి వెళ్లారని అక్క‌డ చికిత్స తీసుకున్నారని స‌మాచారం. వివ‌రాల‌లోకి వెళితే..

Balakrishna wounded but completed shooting

ప్రస్తుతం బాల‌కృష్ణ అఖండ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఆహా టాక్ షో కోసం ప్రోమో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. తాజాగా జ‌రిగిన షూట్ లో బాల‌య్య కాలికి గాయ‌మైన‌ట్టు తెలుస్తోంది. బాలయ్య కాలుకి అయిన గాయం చిన్న‌దేనట‌.

అయితే బాలయ్య సమయం వృథా చేయకుండా గాయాన్ని లెక్క చేయకుండా షూట్ కానిచ్చేశారు. పని పట్ల ఆయనకు ఉన్న అంకితభావం నందమూరి అభిమానులను ఫిదా చేస్తోంది. సినిమాల కోసం ఆయన పడే తపన, అంకితభావం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్ప‌టికీ వ‌రుస సినిమాలు చేస్తూ అల‌రిస్తూ వ‌స్తున్నారు.

బాలయ్య “అఖండ” సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “అఖండ” సినిమాలో అఘోరాగా కనిపించే సాహసం చేశారు.

తెలుగు ఓటీటీ ‘ఆహా’ కోసం బాలయ్య పని చేయనున్నారని తెలుస్తుండ‌గా, ఈ పాపులర్ ఓటీటీ కోసం బాలయ్య హోస్ట్ గా ఉండనున్నారు. అయితే ఈ షో కోసం ఆహా టీం పెద్ద లిస్ట్ రెడీ చేశారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ, ప్రభాస్ సహా టాలీవుడ్‌తోపాటు ఇతర భాషలకు చెందిన సెలబ్రిటీలతోనూ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment