Balakrishna : సినిమాల్లో బాలయ్య తొడకొడితే.. థియేటర్లో ప్రేక్షకులు జై కొడతారు. ఆయన చేసే ఫైట్లకు, ఫీట్లకు అభిమానులు ఫిదా అవుతుంటారు. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు. ఆరు పదుల వయస్సులోనూ ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న బాలకృష్ణ మరోవైపు ఆహా కోసం అన్‌స్టాపబుల్ అనే షో చేస్తున్నారు.
ఓటీటీ మాధ్యమం ఆహా.. డిజిటల్ ప్లాట్ ఫాంలో టాక్ షో సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సామ్ జామ్ అనే టాక్ షోతో ప్రేక్షకులను అలరించిన ఆహా.. ఈసారి బాలయ్యతో కలిసి.. అన్‌స్టాబబుల్ విత్ ఎన్‌బీకే పేరుతో ఓ టాక్ షో జరుగుతోంది. మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు ఫ్యామిలీ హాజరు కాగా, రెండో ఎపిసోడ్‌లో నాని సందడి చేశారు.
మూడో గెస్ట్ ఎవరు అయి ఉంటారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో విజయ్ దేవరకొండ పేరు ఫ్రేంలోకి వచ్చింది. విజయ్ దేవరకొండ అంటే కాస్త బోల్డ్ హీరో అనే టాక్ ఉంది. రౌడీ స్టార్ తో బాలయ్య టాక్ షో అంటే రచ్చ ఓ రేంజ్ లో ఉండడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
వచ్చే శుక్రవారం ఆహాలో విజయ్ దేవరకొండ షో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. విజయ్ దేవరకొండతోపాటు ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ లేదా లైగర్ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ సందడి చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి దీనిపై పూర్తి క్లారిటీ మరి కొద్ది రోజులలో రానుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…