Balakrishna : బాల‌య్య షో మూడో గెస్ట్ ఎవ‌రో తెలుసా.. ర‌చ్చ రంబోలానే అంట‌..!

November 14, 2021 11:41 AM

Balakrishna : సినిమాల్లో బాలయ్య తొడకొడితే.. థియేటర్లో ప్రేక్షకులు జై కొడతారు. ఆయన చేసే ఫైట్లకు, ఫీట్లకు అభిమానులు ఫిదా అవుతుంటారు. ఆయ‌న సినిమాల కోసం ప్రేక్ష‌కులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తుంటారు. ఆరు ప‌దుల వ‌య‌స్సులోనూ ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న బాల‌కృష్ణ మ‌రోవైపు ఆహా కోసం అన్‌స్టాప‌బుల్ అనే షో చేస్తున్నారు.

Balakrishna unstoppable with nbk who is third guest

ఓటీటీ మాధ్యమం ఆహా.. డిజిటల్ ప్లాట్ ఫాంలో టాక్ షో సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సామ్ జామ్ అనే టాక్ షోతో ప్రేక్షకులను అలరించిన ఆహా.. ఈసారి బాలయ్యతో కలిసి.. అన్‌‏స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకే పేరుతో ఓ టాక్ షో జరుగుతోంది. మొదటి ఎపిసోడ్ లో మోహ‌న్ బాబు ఫ్యామిలీ హాజ‌రు కాగా, రెండో ఎపిసోడ్‌లో నాని సంద‌డి చేశారు.

మూడో గెస్ట్ ఎవ‌రు అయి ఉంటారు అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు ఫ్రేంలోకి వ‌చ్చింది. విజయ్ దేవరకొండ అంటే కాస్త బోల్డ్ హీరో అనే టాక్ ఉంది. రౌడీ స్టార్ తో బాల‌య్య టాక్ షో అంటే ర‌చ్చ ఓ రేంజ్ లో ఉండ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు భావిస్తున్నారు.

వచ్చే శుక్రవారం ఆహాలో విజయ్ దేవరకొండ షో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. విజయ్ దేవరకొండతోపాటు ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ లేదా లైగర్ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ సంద‌డి చేస్తార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. మ‌రి దీనిపై పూర్తి క్లారిటీ మరి కొద్ది రోజుల‌లో రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now