Balakrishna : మళ్లీ 28 ఏళ్ల త‌రువాత‌.. ఎస్వీ కృష్ణారెడ్డితో బాల‌కృష్ణ సినిమా..!

April 23, 2022 3:14 PM

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ మంచి స్పీడ్ మీదున్నారు. వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే అఖండ చిత్రంతో భారీ హిట్ కొట్టిన బాల‌కృష్ణ ప్ర‌స్తుతం గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల‌లో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. త్వ‌ర‌లో అనిల్ రావిపూడితోనూ ఓ సినిమా చేయ‌బోతున్నారు బాల‌కృష్ణ‌. అయితే ఇప్పుడు ఊహించ‌ని డైరెక్ట‌ర్‌తో బాల‌కృష్ణ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు ఎస్వీ కృష్ణా రెడ్డి.

Balakrishna signed for a film with SV Krishna Reddy
Balakrishna

య‌మ‌లీల 2 సినిమా త‌ర్వాత మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్ట‌ని కృష్ణారెడ్డి రీసెంట్‌గా సోహైల్‌తో సినిమా చేసేందుకు స‌న్న‌ద్ద‌మ‌య్యారు. కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమాలు, మధ్యతరగతి విలువలు, బాధ‌ల్ని చెప్పే సినిమాలు తీస్తూ ఎన్నో విజయాలు అందుకున్న ఎస్వీ కృష్ణా రెడ్డి.. మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, అభిషేకం, యమలీల, శుభలగ్నం, మావి చిగురు, పెళ్ళాం ఊరెళితే, ఘటోత్కచుడు, యమలీల, ఎగిరే పావురమా.. లాంటి ఎన్ని హిట్ క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించారు.

ఎస్వీ కృష్ణారెడ్డి కేవలం డైరెక్టర్ గానే కాక తన సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా, నటుడిగా, రచయితగా కూడా పని చేశారు. ప్ర‌స్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్‌తో సినిమా చేస్తున్న ఆయ‌న త్వ‌ర‌లో బాల‌కృష్ణ‌తో ఓ మూవీ చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. 1994లో టాప్ హీరో సినిమా కోసం ఈ ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేశారు. ఇక రాఘవేంద్ర‌రావుతో కూడా బాల‌కృష్ణ ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. వీటిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

గ‌తేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన అఖండ తో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన తర్వాత వరుసగా క్రేజీ దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు. ఇక‌ ఇప్పుడు ఔట్ డేటెడ్ అయిపోయిన దర్శకుడితో సినిమా చేయ‌నున్న‌ట్టు వస్తున్న వార్త‌ల‌ని చ‌దివి అంద‌రూ షాక్ అవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now