Balakrishna : బాల‌కృష్ణ టాక్ షోకి ఏం పేరు పెట్టారు ? తొలి గెస్ట్ ఎవ‌రు ?

October 8, 2021 9:57 AM

Balakrishna : వెండితెర‌పై సంద‌డి చేస్తున్న స్టార్స్ ఇప్పుడు బుల్లితెర‌పై కూడా వినోదం పంచేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. నాగార్జున‌, చిరంజీవి, రానా, స‌మంత‌, త‌మ‌న్నా, ఎన్టీఆర్, నాని వంటి స్టార్స్ ప‌లు షోల‌తో సంద‌డి చేశారు. ఇక ఇప్పుడు బాల‌కృష్ణ టైం వ‌చ్చింది. ఆహా కోసం నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా మార‌నున్నార‌ని తెలుస్తోంది. బాలయ్యతోపాటు మరికొందరు సెలెబ్రిటీలు కూడా పాల్గొంటారని సమాచారం. ఈ షోను ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపోందిస్తోందట.

Balakrishna ott show name who is first guest

బాల‌కృష్ణ హోస్ట్ చేయ‌నున్న టాక్‌ షోకు అన్ స్టాపబుల్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు న్యూస్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ముందుగా మంచు మోహ‌న్ బాబు కుటుంబం ఈ షోకి తొలి గెస్ట్‌గా రాబోతుంద‌ని టాక్‌. కాగా పూర్తి వివ‌రాల‌పై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త రానుంది. ఇక బాల‌య్య సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా యాక్షన్ ఫిల్మ్ అఖండ చేస్తున్నారు. ఈ సినిమా తాజాగా షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుందని చిత్రబృందం తెలిపింది.

బాల‌య్య‌ త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో కథానాయికగా పూర్ణ యాక్ట్ చేస్తోంది. నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.

‘సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్ అఖండ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. త్వ‌ర‌లో క్రాక్ డైరక్టర్ గోపీచంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now