Balakrishna : బాల‌కృష్ణ కొత్త సినిమా టైటిల్ ఇదే..? ఫ్యాన్స్‌కు పూన‌కాలు ఖాయం..!

Balakrishna : నందమూరి బాలకృష్ణ అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు ఆయన అనుకుంటే హోస్ట్ గా కూడా మెప్పించగలర‌ని అన్‌స్టాప‌బుల్ షోతో నిరూపించారు. బాలయ్య టాలెంట్ చూసి ప్ర‌తి ఒక్క‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. త్వ‌ర‌లో మ‌రో సీజన్‌ని కూడా హోస్ట్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. అయితే గ‌త ఏడాది అఖండతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన బాల‌కృష్ణ అదే ఉత్సాహంతో గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ర‌వితేజ తో క్రాక్ సినిమాను తెరకెక్కించిన గోపీచంద్ మలినేని ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Balakrishna

క్రాక్ సినిమాతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో బాల‌కృష్ణ‌తో సినిమా చేసే ఛాన్స్ ద‌క్కించుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఖతర్నాక్ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి అన్నగారు అనే పేరు పెట్టారని, త్వరలోనే అధికారికంగా కన్ఫర్మేషన్ రానుందని సమాచారం. గ‌తంలో సీనియ‌ర్ ఎన్టీఆర్‌ని అంద‌రూ అన్న‌గారు అని పిలిచిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికీ ఆయ‌న‌ను అలాగే పిలుస్తుంటారు. దీంతో అదే పేరును బాల‌కృష్ణ కొత్త సినిమాకు పెట్ట‌నున్నార‌ని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్య‌క్తం చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కేక పెట్టిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

బాల‌య్య స‌ర‌స‌న శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలకృష్ణ ఈ సినిమాలో విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒక పాత్రలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మరొక పాత్రలో సాఫ్ట్ గా కనిపించే బిజినెస్‌మ్యాన్‌ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తి అయినట్లు సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM