ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా.. దిగ్గజ వ్యాపారవేత్తలు అయినా.. రాజకీయ నాయకులు అయినా సరే.. అందరికీ బాల్యం దాదాపుగా ఒకేలా ఉంటుంది. ఆటపాటలు, అల్లరి చేష్టలతో బాల్యం కొనసాగుతుంది. ఆ వయస్సులో మనం చేసే అల్లరిని చూసి మన తల్లిదండ్రులు ముచ్చట పడుతుంటారు. ఇక చిన్నతనంలో మనల్ని వారు తీయించే ఫొటోలను మనం పెద్దయ్యాక చూసుకుంటే.. మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతలా మారిపోయామో కదా అని అనుకుంటారు. ఇక సమంత చిన్న నాటి ఫొటోను చూసినా అలాంటి ఆశ్చర్యం కలగకమానదు.
సమంత ఎంత అందంగా ఉంటుందో.. ఎంతగా అలరిస్తుందో అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నాగచైతన్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి సమంతపై విమర్శలు ఎక్కువయ్యాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆమె చేసే అందాల ప్రదర్శన కారణంగా ఆమెపై ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఆమె తట్టుకోలేకపోతోంది. ఎప్పటికప్పుడు ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆమె విహార యాత్రలకు వెళ్తోంది. అందులో భాగంగానే రీసెంట్‌గా ఆమె థాయ్‌లాండ్‌కు వెళ్లి వచ్చింది.
ఇక ఇటీవలే తన 35వ జన్మదినాన్ని జరుపుకున్న సమంత కొత్త మూవీతో పలకరించింది. కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమాతో ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక త్వరలోనే ఈమె నటించిన యశోద, శాకుంతలం అనే సినిమాలు రిలీజ్ కానున్నాయి. పలు వెబ్‌సిరీస్‌లలోనూ ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి. అయితే సమంత బర్త్ డే సందర్భంగా ఆమె చిన్ననాటి ఫొటోను తెగ వైరల్ చేస్తున్నారు. అందులో ఆమె ఎంతో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు భిన్న రకాల ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్లను ఓపెన్ చేసి తమ అభిమానులతో…
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో…
బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది.…
అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యులని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు డ్యాన్స్ నేర్పింది తానేనని సీనియర్…
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…