Balakrishna : బాల‌కృష్ణ‌కు శ‌స్త్ర చికిత్స‌.. షాక్‌లో అభిమానులు..

November 2, 2021 7:48 PM

Balakrishna : వ‌యోభారం కార‌ణంగా సీనియ‌ర్ స్టార్స్‌కి సంబంధించిన స‌మ‌స్య‌లు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇటీవ‌ల చిరంజీవి చేతికి శ‌స్త్ర చికిత్స జ‌ర‌గగా, ఇప్పుడు బాల‌కృష్ణ భుజానికి ఆప‌రేష‌న్ జ‌రిగిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌త ఆరు నెలలుగా బాలకృష్ణ భుజం నొప్పితో బాధపడుతున్న నేప‌థ్యంలో ఆయ‌న బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో అక్టోబ‌ర్ 31న శ‌స్త్ర చికిత్స చేయించుకున్నార‌ట‌.

Balakrishna got surgery to hand fans worrying

ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ రఘువీర్‌రెడ్డి, డాక్టర్‌ బి.ఎన్‌.ప్రసాద్‌ల బృందం నాలుగు గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ తెలుగు ఓటీటీ మాధ్య‌మ‌మైన ఆహాలో అన్‌స్టాప‌బుల్ అనే టాక్‌షో కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. తొలి ఎపిసోడ్‌లో మోహ‌న్ బాబు చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు. త‌ర్వాత రానా ద‌గ్గుబాటి,నాని, ఎన్టీఆర్ హాజ‌రు కాబోతున్నార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘అఖండ’ విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. దీని తర్వాత గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now