Manchu Vishnu : బాల‌య్య బాబు స‌పోర్ట్ మంచు విష్ణుకే.. ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న మా ఎన్నిక‌లు..

October 3, 2021 4:58 PM

Manchu Vishnu : అటు ప్ర‌కాష్ రాజ్‌.. ఇటు మంచు విష్ణు.. ఇద్ద‌రూ మా ఎన్నిక‌ల్లో భాగంగా ప్ర‌చారం పెంచారు. ఇద్ద‌రూ త‌మ త‌మ ప్యానెల్ మెంబ‌ర్ల‌తో క‌లిసి మా స‌భ్యుల‌ను క‌లుస్తూ త‌మ‌కు ఓటు వేయాల‌ని అభ్య‌ర్థిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మంచు విష్ణు బాల‌య్య బాబును క‌లిశారు. ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోరారు. అందుకు బాల‌య్య బాబు కూడా అంగీక‌రించారు.

Manchu Vishnu : బాల‌య్య బాబు స‌పోర్ట్ మంచు విష్ణుకే.. ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న మా ఎన్నిక‌లు..

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ అఖండ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే మంచు విష్ణు బాల‌కృష్ణను క‌లిశారు. అయితే మంచు విష్ణుకు బాల‌కృష్ణ త‌న మ‌ద్ద‌తు తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న థ‌మ్స‌ప్ చూపించారు.

బాల‌కృష్ణ త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నందుకు గాను మంచు విష్ణు ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మేర‌కు విష్ణు ట్వీట్ చేశారు. మా ఎన్నిక‌ల్లో తన‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నందుకు న‌ట సింహం, బాల అన్న‌కు ధ‌న్య‌వాదాలు, మీ మ‌ద్ద‌తు నాకు ల‌భించ‌డం నిజంగా గ‌ర్వంగా ఉంది.. అంటూ విష్ణు ట్వీట్ చేశారు. కాగా మా ఎన్నికలు అక్టోబ‌ర్ 10వ తేదీన జ‌ర‌గ‌నున్నాయి. మంచు విష్ణు ఈ ఎన్నిక‌ల్లో మా అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now