Balakrishna : అఖండ 2 ను తీస్తున్నారా.. లేదా.. క్లారిటీగా చెప్పేసిన బాల‌య్య‌..

November 28, 2022 9:49 PM

Balakrishna : నందమూరి బాలకృష్ణ హిట్ కొడితే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో చూపించిన సినిమా అఖండ. బోయపాటి శ్రీను బాలయ్యల కాంబినేషన్ లో వచ్చిన అఖండ హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. అఘోరా క్యారెక్టర్ లో బాలయ్య చెప్పిన డైలాగ్స్ తో థియేటర్స్ లో ప్రేక్షకులు వేసిన విజిల్స్ కి డిటిఎస్ రేంజ్ లో సౌండ్ మారుమోగిపోయింది. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ఈ మూవీకి మరో హైలెట్ అని చెప్పవచ్చు. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా అంటేనే హిట్ అనే నమ్మకాన్ని మరింత పెంచిన ఈ మూవీ. ఇక ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందనే విషయం మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు.

బాలయ్య కెరీర్ లోనే అఖండ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజాగా అఖండ సినిమాకి సీక్వెల్ ఉంటుందని చెప్పి బాలయ్య కూడా అందర్నీ సర్ప్రైజ్ చేశారు. ఈ ఏడాది జరుగుతున్న గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో అఖండ సినిమాని స్పెషల్ స్క్రీనింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత రవీందర్ రెడ్డిలతో పాటు బాలయ్య కూడా ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య అఖండ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు.

Balakrishna given clarity on akhanda 2 movie
Balakrishna

ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని బాలయ్య కంప్లీట్ చేసే లోపు, బోయపాటి శ్రీను రాం పోతినేనితో చేస్తున్న సినిమాని కంప్లీట్ చేయనున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే అఖండ 2 సినిమా వచ్చే ఎలక్షన్స్ కన్నా ముందే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని టాక్ వినిపిస్తుంది.

అయితే అఖండ సినిమాని తెలుగుకి మాత్రమే పరిమితం చేసిన మూవీ మేకర్స్ అఖండ సీక్వెల్ ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయాలని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. మరి బోయపాటి బాలయ్య అభిమానుల కోరిక మేరకు అఖండ 2 సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో  చేస్తారో లేదో అనే విషయం వేచి చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now