Balakrishna : స‌ప్త‌గిరి కాళ్లు ప‌ట్టుకుంటాన‌న్న బాల‌య్య‌.. అస‌లేం జ‌రిగింది.. వీడియో..!

Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలందరిలో బాలయ్యకు ఉన్న క్రేజ్ వేరు. ప్రస్తుతం బాలకృష్ణ ఇటు సినిమాల‌తోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. అఖండ చిత్రంతో సక్సెస్ ను అందుకున్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేతిలో ఇప్పుడు బోలెడు ప్రాజెక్టులు వచ్చిపడ్డాయి. అఖండ చిత్రం సక్సెస్ కావడంతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఎన్‌బీకే 107 పై అందరి దృష్టి పడింది.

బోయపాటి దర్శకత్వలో వచ్చిన అఖండ సినిమాలో బాలయ్య నట విశ్వరూపంతో నందమూరి అభిమానుల నుంచి అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో బాలయ్య నెక్స్ట్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎన్బీకే 107 మూవీలో భాగంగా టర్కీలో బాలయ్య షూటింగ్‌ తో బిజీగా ఉన్నారు. బాలకృష్ణ మాట కరుకు మనసు వెన్న లాంటి స్వభావం కలవారు. బాలయ్యకు అభిమానులంటే ఎంతో అభిమానం. ఇంతకముందు టర్కీలో ఓ రెస్టారెంట్‌లో సామాన్యుడితో ముచ్చటించిన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Balakrishna

ఇక తాజాగా కమెడియన్ సప్తగిరితో ఫన్నీగా మాట్లాడిన బాలయ్య బాబు వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో సప్తగిరితోపాటు డైలాగ్ చెబుతూ బాలయ్య అలరించారు. ఒకేసారి ఇద్దరు డైలాగ్ చెబుతుండగా మధ్యలో బాలయ్య ఆపేశారు. సప్తగిరి మాత్రం డైలాగ్ కంటిన్యూ చేసి బాలయ్యను మెప్పించాడు. సప్తగిరి టాలెంట్ ను చూసి వెంటనే బాలయ్య ఫన్నీగా సప్తగిరి కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించారు. సప్తగిరి నవ్వుకుంటూ బాలయ్య కాళ్ల పట్టుకున్నాడు. ఓసారి నీ కాళ్లుపైకి ఎత్తరా దండం పెడతా, దండం పెట్టడం కోసం కిందకు వంగితే నా నడుము విరిగేటట్లు ఉంది అంటూ సప్తగిరితో చాలా సరదాగా మాట్లాడారు బాలకృష్ణ. ప్రస్తుతం ఈ వీడియో అభిమానుల‌ను ఎంతగానో అలరించడంతోపాటు సోషల్ మీడియాలోనూ ఆక‌ట్టుకుంటోంది. నెటిజ‌న్లు దీన్ని ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM