Balakrishna : సమంత వల్ల కాని పనిని.. బాలకృష్ణ చేసి చూపించారా..?

November 15, 2021 11:01 AM

Balakrishna : తెలుగు ఓటీటీ సంస్థ అయిన ఆహా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పలు టాక్ షోలు, వంటల కార్యక్రమాలు, సినిమాలు, వెబ్ సిరీస్ లను ప్రసారం చేస్తూ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కార్యక్రమాలను ప్రసారం చేస్తూ దూసుకుపోతోంది. ఆహాలో గతంలో సమంతను వ్యాఖ్యాతగా ఉంచి సామ్ జామ్ అనే టాక్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం సమంతను రంగంలోకి దించినా ఈ కార్యక్రమం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యిందని చెప్పవచ్చు.

Balakrishna  done good job with talk show not samantha

ఇక సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ టాక్ షోకి ప్రేక్షకాదరణ కరువైందని చెప్పవచ్చు. తాజాగా ఆహా నందమూరి బాలకృష్ణను రంగంలోకి దింపింది. ఈ క్రమంలోనే బాలయ్య వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ అనే టాక్ షోను నిర్వహిస్తున్నట్లు తెలియడంతో ఎంతో మంది నెటిజన్లు పలు రకాల సందేహాలను వ్యక్తపరిచారు.

అసలు ఒక మాట ఎక్కువ మాట్లాడితే అందరిపై చేయి చేసుకునే బాలయ్య ఓపిగ్గా ఈ టాక్ షోను నిర్వహించగలరా.. అల్లు అరవింద్ ఏ నమ్మకంతో బాలకృష్ణను వ్యాఖ్యాతగా తీసుకున్నారు.. అంటూ చాలా రకాలుగా సందేహాలను వ్యక్తం చేశారు.

అయితే ఈ కార్యక్రమం ప్రోమోకి నిర్వాహకులు ఊహించని విధంగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ రావడంతో నిర్వాహకులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మొదటి ఎపిసోడ్ లో భాగంగా మోహన్ బాబును రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే మొదటి ఎపిసోడ్ కు ఎవరూ ఊహించని విధంగా అత్యధిక ప్రేక్షకాదరణ లభించింది.

అలాగే ఎంతోమంది సబ్‌స్క్రైబర్లు కొత్తగా చేరారని ఆహా నిర్వాహకులు వెల్లడించారు. ఇక రెండవ ఎపిసోడ్ లో భాగంగా నాని బాలయ్యతో కలిసి సందడి చేశారు. కాగా మూడవ ఎపిసోడ్ కు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను రంగంలోకి దింపనున్నారు. ఏది ఏమైనా ఆహాలో టాక్‌ షో ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సమంత విఫలమైందని.. బాలకృష్ణ విజయం సాధించారని.. చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now