Balakrishna And Nagarjuna : బాల‌య్య‌, నాగార్జున కాంబినేష‌న్ లో మిస్ అయిన మ‌ల్టీ స్టార‌ర్ మూవీ.. కార‌ణం అదేనా..?

October 11, 2022 10:38 AM

Balakrishna And Nagarjuna : వెండితెరపై ఎన్ని రకాలు చిత్రాలు వచ్చిన కూడా మల్టీస్టారర్ చిత్రాలని చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారు. ఎందుకంటే ఒకే టికెట్ పై రెండు సినిమాలు చూసినట్లు ఇద్దరు స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటానికి అభిమానులు బాగా ఆసక్తి చూపుతారు. ఇలా అభిమానులు ఇష్టపడే మల్టీస్టారర్ చిత్రాలు టాలీవుడ్ లో ఎన్నో వచ్చాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలోనే  టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా అప్పటిలో ఎన్టీఆర్ ఏఎన్నార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు ఒకే తెరపై కనిపిస్తున్నారు అంటే చాలు అభిమానులు పండగ చేసుకునేవారు.

ఆ తర్వాత కాలంలో నందమూరివారి నటవారసుడిగా బాలకృష్ణ, ఏఎన్ఆర్ నటవారసుడిగా నాగార్జున హీరోలగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో బాలకృష్ణ మరియు నాగార్జున కాంబినేషన్ లోనూ మల్టీస్టారర్ రావాలని అభిమానులు  కోరుకున్నారు. ఇక ఏఎన్నార్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన గుండమ్మ కథ సినిమాను మరోసారి కథలో మార్పులు చేసి బాలకృష్ణ, నాగార్జునలతో తెరకెక్కించాలని అప్పటిలో ప్రయత్నాలు జరిగాయి. కానీ కొన్ని కారణాలవల్ల వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు.

Balakrishna And Nagarjuna combination movie missed
Balakrishna And Nagarjuna

ఆ తర్వాత మరో ప్రయత్నంగా మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన క్రిస్టియన్ బ్రదర్స్ సినిమాను బాలకృష్ణ, నాగార్జునలతో రీమేక్ చేయాలని కూడా ప్రయత్నాలు జరిగాయట. ఈ సినిమా కోసం నిర్మాత సురేష్ బాబు వీరిద్దరిని ఒప్పించడం కూడా జరిగిందట. ఈ సినిమాకు బాలకృష్ణ, నాగార్జున ఇద్దరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ప్రాజెక్ట్ కూడా ఆలస్యం అవడంతో నాగార్జున, బాలయ్యల మధ్య సఖ్యత లేదనే వార్తలు వినిపించాయి. దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో రావలసిన మరో సినిమా కూడా ఆగిపోయింది. ఇక 1999లో ఎన్టీఆర్  మరో వారసుడు హరికృష్ణ, నాగార్జున కాంబినేషన్ లో సీతారామరాజు సినిమా వచ్చింది. ఈ సినిమా అప్పటిలో  మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో నందమూరి మరియు అక్కినేని అభిమానుల కల నెరవేరింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now