Allu Arjun : అల్లు అర్జున్ జాత‌కం ఎలా ఉందో చెప్పేసిన వేణు స్వామి..!

April 5, 2022 8:29 PM

Allu Arjun : పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న న‌టించిన పుష్ప సినిమాలోని పాట‌ల‌కు క్రికెట‌ర్స్, సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు తెగ చిందులేశారు. పుష్ప‌తో నానా ర‌చ్చ చేసిన బన్నీ త్వ‌ర‌లో పుష్ప 2తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా మారిన బ‌న్నీ గురించి ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టాలీవుడ్‌లో మంచి జాతకమున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది అల్లు అర్జున్‌ ఒక్కరే. రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆయన జాతకంలో ఎటువంటి మార్పులుండవు. ఆయన తీసే ప్రతి సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో రూ.200 కోట్ల పైనే బిజినెస్‌ చేస్తుంది.. అని అన్నారు.

astrologer Venu Swamy told horoscope of Allu Arjun
Allu Arjun

అల్లు అర్జున్ టాలీవుడ్‌కి బంగారు బాతు. జూనియర్‌ ఎన్టీఆర్‌, రానా, మహేశ్‌బాబుల జాతకం కూడా బాగానే ఉంది. అక్కినేని అఖిల్‌ జాతకంలో నాగదోషం ఉంది. ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్‌ లేకుండా సినిమాలు చేస్తే కచ్చితంగా హిట్‌ కొడతాడు. సమంత జాతకం బాగుంది. చైతూతో విడాకుల తర్వాత ఆమెపై పెరిగిన నెగెటివిటీ ఈ సంవత్సరం తగ్గబోతోంది. 2024 వరకు టాలీవుడ్‌లో రష్మిక, సమంత, పూజా హెగ్డేలకు తిరుగులేదు. ఏలినాటి శని ఉన్న పెద్ద దర్శకులకు ఊహించిన విజయాలు రాకపోవచ్చు.. అని వేణు స్వామి జోస్యం పలికాడు.

నాగచైతన్య, సమంత విడిపోతారని గతంలో జోస్యం చెప్పిన వేణు స్వామి.. కేసీఆర్, చంద్రబాబు అనారోగ్య సమస్యలతో కన్నుమూస్తారని 2017లో సొల్లు జోస్యం చెప్పాడు. రెండు నెలల్లో కవిత మంత్రి పదవి చేపడుతారని నాలుగేళ్ళ క్రితం చెప్పిన ఆస్ట్రాలజర్ ఇతనే. కాకపోతే.. సమంత, నాగ చైతన్య విడిపోతారని చెప్పింది నిజం కావడం, కొన్ని సినిమాల ఫలితాలు నిజం కావడంతో మళ్ళీ ఈయన జోస్యాలకు సోషల్ మీడియాలో క్రేజ్ వచ్చింది. ప్ర‌భాస్ తో సినిమాలు చేస్తే నిర్మాత‌లు ఆరిపోవ‌డ‌మే అంటూ.. వేణు స్వామి ప‌లు షాకింగ్ కామెంట్స్ కూడా చేశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now