Ashu Reddy : అషు రెడ్డికి ఖ‌రీదైన కారు గిఫ్ట్‌.. ఇచ్చింది ఎవ‌రంటే..?

September 16, 2022 1:33 PM

Ashu Reddy : సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే వారికి అషు రెడ్డి గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. జూనియ‌ర్ స‌మంత‌గా పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ బిగ్ బాస్ సీజన్ 3 తో ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంది. నెట్టింట ఎప్ప‌టిక‌పుడు తన హాట్ ఫొటోలతో కుర్ర‌కారును ఫిదా చేసే ఈ భామ‌ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అషు రెడ్డికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మిలియన్ ల‌లో ఉంది. దీన్నిబట్టి అషు రెడ్డికి ఏ రేంజ్ లో క్రేజ్ వుందో వేరే చెప్పనవసరం లేదు.

సెప్టెంబ‌ర్ 15 అషు రెడ్డి పుట్టిన‌రోజు. అషు పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలో చాలా ముఖ్య‌మైన వ్య‌క్తి దగ్గర నుంచి ఖ‌రీదైన కారుని బ‌హుమ‌తిగా అందుకుంది. ఇంతకీ ఎవరు అంత స్పెషల్ వ్యక్తి అనుకుంటున్నారా..? ఆ ముఖ్యమైన వ్యక్తి ఇంకెవరో కాదు..  అషు రెడ్డి తండ్రి ఆమెకు ఖ‌రీదైన మెర్సిడేజ్ బెంజ్ C200D మోడ‌ల్ కారును పుట్టినరోజు కానుక‌గా ఇచ్చారు. త‌న తండ్రితో క‌లిసి కారు ముందు దిగిన ఫొటోల‌ను తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది అషు. అంతే కాకుండా క్ష‌మించు అమ్మ‌.. షాక‌వ్వ‌కు.. ఇది నాన్న ఇచ్చిన గిఫ్ట్ అంటూ ఫొటోలకు క్యాప్ష‌న్ పెట్టింది.

Ashu Reddy got expensive car as gift
Ashu Reddy

ప్రస్తుతం అషు రెడ్డి సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. తరచుగా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని తన మాయలో పడేసుకుంటుంది. అషురెడ్డి గ్లామరస్ ఫోటోలు తరచుగా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే అషురెడ్డి తన యూట్యూబ్ ఛానల్ లో ఆసక్తికర వీడియోల‌ను పోస్ట్ చేస్తూ రోజురోజుకీ ఫాలోవర్స్ సంఖ్య పెంచుకుంటుంది. ఎంత అందాల ఆరబోతతో రచ్చ చేస్తున్న కూడా ఆమెకు కోరుకున్న గుర్తింపు రావడం లేదు. ఒక యాంకర్ గా కూడా తాను సరైన గుర్తింపు అందుకోలేకపోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now