Ashoka Vanamlo Arjuna Kalyanam : నెటిజ‌న్ల‌కు థ్యాంక్స్ చెప్పిన విశ్వ‌క్ సేన్‌.. మీరే నా ఆస్తి, నాకు ర‌క్ష‌ణ‌.. అంటూ ఎమోష‌న‌ల్‌..!

May 4, 2022 9:32 AM

Ashoka Vanamlo Arjuna Kalyanam : విశ్వ‌క్ సేన్‌, రుక్సార్ ధిల్ల‌న్‌లు హీరో హీరోయిన్లుగా న‌టించిన లేటెస్ట్ చిత్రం.. అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమా మే 6వ తేదీన విడుద‌ల కానుంది. కాగా ఈ మూవీకి గాను మంగ‌ళ‌వారం రాత్రి ఖ‌మ్మంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఇందులో భాగంగా న‌టుడు విశ్వ‌క్ సేన్ మాట్లాడిన మాట‌లు వైర‌ల్ అవుతున్నాయి. గ‌త 3, 4 రోజులుగా నువ్వా నేనా అన్న‌ట్లుగా యాంక‌ర్ దేవి, విశ్వ‌క్ సేన్ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే విశ్వ‌క్ సేన్‌కు నెటిజ‌న్లు మ‌ద్ద‌తు ప‌లికారు. యాంక‌ర్ దేవిదే త‌ప్పంతా.. అని ఆయ‌న‌కు స‌పోర్ట్‌ను ఇచ్చారు. అయితే దీనిపై విశ్వ‌క్ సేన్ స్పందించారు.

Ashoka Vanamlo Arjuna Kalyanam Vishwak Sen got emotional
Ashoka Vanamlo Arjuna Kalyanam

తన‌కు స‌పోర్ట్‌ను ఇచ్చినందుకు ఫ్యాన్స్‌, నెటిజన్లు.. అంద‌రికీ విశ్వ‌క్ సేన్ థాంక్స్ చెప్పారు. మీరు స‌పోర్ట్ ఇవ్వ‌బ‌ట్టే నేను ఇలా మీ ముందు ఉన్నా.. అదే ఇత‌రులు, బ‌ల‌హీన‌మైన వారు అయితే ఏమైపోయేవారే.. మీరే నా ఆస్తి, మీరే నాకు ర‌క్ష‌ణ‌.. మీరు నాకు అందించిన స‌పోర్ట్‌ను మ‌రిచిపోలేను. మీరు ఉండ‌గా న‌న్ను ఎవ‌రూ ఏమీ పీక‌లేరు. ఇంకా డౌట్ వ‌స్తే హ్యాష్ ట్యాగ్ విశ్వ‌క్‌సేన్ అని కొట్టి చూడ‌మ‌ని చెబుతా.. అని విశ్వ‌క్ సేన్ అన్నారు.

ఇక త‌న త‌ల్లికి ఒక‌టే చెప్పాన‌న్న విశ్వ‌క్ సేన్‌.. త‌న‌ను ఎవ‌రు ఏమీ చేయ‌లేర‌ని అన్నారు. త‌న‌కు అమ్మాయిలు ఉంటే మ‌ర్యాద ఉంద‌ని.. తాను అమ్మాయిలకు మ‌ర్యాద ఇవ్వ‌క‌పోతే ఆరోజు స్టూడియోకు ఎందుకు వ‌స్తాన‌ని అన్నారు. ఈ విష‌యంలో త‌న‌కు అంద‌రూ స‌పోర్ట్ ఇచ్చినందుకు విశ్వ‌క్‌సేన్ మ‌రోమారు నెటిజ‌న్ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎమోష‌న‌ల్ అయ్యారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now