Ashoka Vanamlo Arjuna Kalyanam : అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

May 27, 2022 6:06 PM

Ashoka Vanamlo Arjuna Kalyanam : యంగ్ యాక్ట‌ర్ విశ్వ‌క్ సేన్‌, రుక్సార్ ధిల్లాన్.. హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన చిత్రం.. అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి టాక్‌నే సాధించిన‌ప్ప‌టికీ పెద్ద‌గా క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయింది. న్యూస్ యాంక‌ర్ దేవీ నాగ‌వ‌ల్లితో ఏర్ప‌డిన వివాదం కార‌ణంగా ఈ మూవీకి బాగానే ప‌బ్లిసిటీ వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ ఈ మూవీ థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కుల‌ను మాత్రం ర‌ప్పించ‌లేక‌పోయింది. అయితే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో విడుద‌ల అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం సినిమాకు గాను డిజిట‌ల్ హ‌క్కుల‌ను ఆహా సంస్థ సొంతం చేసుకున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఈ యాప్‌లో ఈ మూవీని స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఇక ఆహాలో జూన్ 3వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మేర‌కు ఆహా అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది.

Ashoka Vanamlo Arjuna Kalyanam OTT release date fix
Ashoka Vanamlo Arjuna Kalyanam

కాగా ఈ మూవీని ఎస్‌వీసీసీ డిజిట‌ల్ నిర్మించింది. జై క్రిష్ సంగీతం అందించారు. ప్రేక్ష‌కుల నుంచి మాత్రం ఈ మూవీకి మంచి స్పంద‌నే ల‌భించింది. క‌నుక ఓటీటీలో ఈ మూవీ క‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now