Aryan Khan : డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ చేత నిందితుడిగా అరెస్టు చేయబడిన ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యాడు. షారూఖ్ స్వయంగా వచ్చి తన కుమారున్ని ముంబై ఆర్థర్ రోడ్ జైల్ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. దాదాపుగా ఆర్యన్ 4 వారాలకు పైగానే జైలులో ఉన్నాడు. ఈ క్రమంలోనే పలు మార్లు అతను పెట్టుకున్న బెయిల్ దరఖాస్తులను కూడా కోర్టు తిరస్కరించింది.
అయితే ఆర్యన్ కు బెయిల్ ఇచ్చినప్పటికీ కోర్టు 14 షరతులను విధించింది. ఈ క్రమంలోనే షారూఖ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన జూహీ చావ్లా బెయిల్‌కు అయ్యే పూచీకత్తును సమర్పించడంతోపాటు ఆర్యన్ ఏం చేసినా తనదే బాధ్యత అని ష్యూరిటీ సంతకం కూడా చేసింది.
ఇక శనివారం ఉదయం షారూఖ్ ఖాన్ తన లాయర్లతో కలిసి జైలుకు వచ్చారు. ఈ క్రమంలో కొన్ని గంటల పాటు వేచి చూశారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాక మధ్యాహ్నం ఆర్యన్‌ను జైలు నుంచి విడుదల చేశారు. భద్రతా పరమైన కారణాలతో జైలు వద్ద ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించి బందోబస్తును పెంచారు.
అయితే మీడియాతో మాట్లాడడం ఇష్టం లేని షారూఖ్ ఖాన్ జైలు ప్రధాన ద్వారం వద్దే తన వైట్ రేంజ్ రోవర్‌ను సిద్ధంగా ఉంచారు. దీంతో జైలు నుంచి ఆర్యన్ బయటకు వస్తూనే నేరుగా కార్ ఎక్కగా.. కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక ఆర్యన్ విడుదల కావడంతో షారూఖ్ ఖాన్ నివాసం మన్నత్ వద్ద కోలాహలంగా మారింది. అందరూ వేడుకలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…