Aryan Khan : బాలీవుడ్‌లో భారీ కుదుపు.. సంచ‌ల‌నంగా మారిన ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసు.. ఉచ్చులో మ‌రింత మంది..?

October 21, 2021 1:22 PM

Aryan Khan : ముంబై స‌ముద్ర ప్రాంతంలో క్రూయిజ్ షిప్‌పై దాడులు నిర్వ‌హించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ఆర్య‌న్ ఖాన్ స‌హా ప‌లువురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ కేసు ప్ర‌స్తుతం విచార‌ణ‌లో ఉంది. తాజాగా ఆర్య‌న్ ఖాన్ మ‌రోమారు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. అయితే ఆర్య‌న్ ఖాన్ ఏమో గానీ.. ఈ కేసు మొత్తం బాలీవుడ్ మెడ‌కు ఉచ్చులా బిగుసుకుంటుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Aryan Khan drugs case shaking bollywood soon more ride may follow by ncb

ఎన్‌సీబీ అధికారులు తాజాగా కోర్టుకు ప్ర‌వేశ‌పెట్టిన ఆర్య‌న్ ఖాన్ వాట్సాప్ చాట్‌ల‌లో కీల‌క‌విష‌యాలు ఉన్న‌ట్లు తెలిసింది. ఆర్య‌న్ ఖాన్ ఓ బాలీవుడ్ ఔత్సాహిక హీరోయిన్‌తో డ్ర‌గ్స్ విష‌య‌మై చాటింగ్ చేసిన‌ట్లు ఎన్‌సీబీ అధికారులు గుర్తించార‌ని అందుక‌నే కోర్టు బెయిల్ ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. అయితే ఆ హీరోయిన్ అన‌న్య పాండేనేనా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. ఆమె ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు నిర్వ‌హిస్తుండ‌డ‌మే ఇందుకు కార‌ణం.

ఇక అన‌న్య పాండేతోపాటు ఇంకా అనేక మంది ఈ ఉచ్చులో చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ బాలీవుడ్‌లో చాలా మందికి డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసేవాడ‌ని ఎన్‌సీబీ ప్ర‌వేశ‌పెట్టిన చాట్‌ల‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో మ‌రింత మంది బాలీవుడ్ తార‌ల‌పై త్వ‌ర‌లో ఎన్‌సీబీ రైడ్స్ చేస్తుంద‌ని తెలుస్తోంది.

ఆర్య‌న్ ఖాన్ చాట్‌ల‌లో అనేక మంది బాలీవుడ్ తార‌ల పేర్లు వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కొక్క‌రిగా ఎన్‌సీబీ త్వ‌ర‌లోనే అంద‌రిపై దాడులు నిర్వ‌హిస్తుంద‌ని స‌మాచారం. ఆర్య‌న్ ఖాన్ ఎవ‌రెవ‌రితో చాట్ చేశాడు ? అన్న వివరాలు బ‌య‌ట‌కు రాకుండా ఎన్‌సీబీ జాగ్ర‌త్త ప‌డుతోంది. ఈ క్ర‌మంలో ఈ కేసు రోజు రోజుకీ మ‌రింత సంచ‌ల‌నంగా మారుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now