Aryan Khan : ఆర్యన్ ఖాన్ డ్ర‌గ్స్ కేసు విచార‌ణ‌.. బెయిల్ నిర్ణ‌యాన్ని వాయిదా వేసిన కోర్టు..

October 14, 2021 11:03 PM

Aryan Khan : డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయి జైలులో రిమాండ్‌లో ఉన్న ఆర్య‌న్ ఖాన్‌కు బెయిల్ రావ‌డం మ‌రింత ఆల‌స్యం కానుంది. గురువారం ముంబై సెష‌న్స్ కోర్టులో ఇరు ప‌క్షాలు త‌మ వాద‌న‌ల‌ను వినిపించాయి. దీంతో కోర్టు అక్టోబ‌ర్ 20వ తేదీన తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపింది. ఈ క్ర‌మంలో ఆర్య‌న్ ఖాన్ మ‌రో 6 రోజుల పాటు జైలులో ఉండ‌నున్నాడు.

Aryan Khan drugs case bail decision postponed

కాగా కోర్టులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) త‌ర‌ఫున త‌న వాద‌న‌ల‌ను వినిపించిన అద‌న‌పు సాలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ అనిల్ సింగ్ మాట్లాడుతూ.. ఆర్య‌న్ ఖాన్ గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా డ్ర‌గ్స్ ను తీసుకుంటున్నాడ‌ని.. ప్ర‌స్తుతం కేసు విచార‌ణ ప్రాథ‌మిక ద‌ర్యాప్తులోనే ఉంద‌ని, క‌నుక ఆర్య‌న్ ఖాన్‌కు ఈ స‌మ‌యంలో బెయిల్ ఇవ్వ‌డం మంచిది కాద‌ని.. అన్నారు.

ఇక ఆర్య‌న్ ఖాన్ త‌ర‌ఫు న్యాయ‌వాది అమిత్ దేశాయ్ మాట్లాడుతూ.. ఆర్య‌న్ ఖాన్‌ను అరెస్టు చేసిన‌ప్పుడు అత‌ని వ‌ద్ద డ్ర‌గ్స్ ఏమీ లేవ‌ని అన్నారు. ఎన్‌సీబీ కేవ‌లం వాట్సాప్ చాట్‌ల మీద ఆధార‌ప‌డి ఆర్య‌న్‌ఖాన్‌ను దోషిగా నిరూపించే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని ఆరోపించారు. ఇక కోర్టు బెయిల్‌పై తుది నిర్ణ‌యం తీసుకునేందుకు గ‌డువు విధించ‌డంతో ఆర్య‌న్ ఖాన్ ఇంకొన్ని రోజుల పాటు జైలులోనే ఉండ‌నున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now