Arya 3 : ఆర్య 3 విష‌యంలో స‌రికొత్త ఆలోచ‌న చేస్తున్న సుకుమార్.. బ‌న్నీని కాద‌ని..

October 19, 2021 2:01 PM

Arya 3 : సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ఆర్య. ఈ సినిమా బ‌న్నీ కెరీర్‌ని పూర్తిగా మార్చేసింద‌నే చెప్పాలి. ఇందులో ఆర్య‌ని చాలా స్టైలిష్‌గా చూపించాడు సుక్కూ. ఇక ఆర్య 2 చిత్రం కూడా ఇదే కాంబినేష‌న్‌లో రూపొంద‌గా, ఈ చిత్రం అనుకున్నంత విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఇటీవ‌ల ఫాల్కన్ క్రియేషన్స్ సహకారంతో ఆర్య 3 ఉంటుందని సుకుమార్ ప్రకటించాడు.

Arya 3 hero may changed not allu arjun but vijay devara konda

పూరీ దేశముదురు చిత్రం బ‌న్నీని పక్కా మాస్ అండ్ స్టైలిష్ హీరోగా ఎలివేట్ చేస్తే ఆ స్థాయిని ఆర్య 2 మరో లెవల్ కి తీసుకెళ్లింది. ఇక ఆర్య 3 చిత్రం ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న క్ర‌మంలో సుకుమార్ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ను అయితే ఇచ్చాడు. ఇందులో హీరో ఎవ‌రు అనే విష‌యంపై కొద్ది రోజులుగా చ‌ర్చ న‌డుస్తోంది. బ‌న్నీనే హీరో అని అందరు కోరగా, తాజాగా ఫ్రేంలోకి రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు వ‌చ్చింది.

యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలొయింగ్ సంపాదించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ అయితే ఆర్య 3కి స‌రిగ్గా స‌రిపోతాడ‌ని అంద‌రు భావిస్తున్నారు. మ‌రి దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. మరోవైపు అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించడమే ధ్యేయంగా సుకుమార్ పుష్ప ఫ్రాంఛైజీని తెరకెక్కిస్తున్నారు. పుష్ప-1 చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ చిత్రంతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం భారీ బ‌డ్జెట్‌తో.. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now