Ariyana : రాజ్‌ తరుణ్‌ అంటే అస్సలు నచ్చడు.. అంటున్న అరియానా..!

November 29, 2021 10:15 PM

Ariyana : ఒకప్పుడు యాంకర్ గా తన ప్రస్థానం ప్రారంభించిన అరియానా గ్లోరీ ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉంది. ఈమె యాంకర్ గా ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ఇంటర్వ్యూ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యింది. ఈ పాపులారిటీతో బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన ఈమె అనంతరం బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది.

Ariyana : రాజ్‌ తరుణ్‌ అంటే అస్సలు నచ్చడు.. అంటున్న అరియానా..!

ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ నటించిన అనుభవించు రాజా సినిమాలో అరియానా గ్లోరీ కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేషమైన ఆదరణ దక్కించుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా ఆ డైరెక్టర్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె హీరో రాజ్ తరుణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

తనకు రాజ్ తరుణ్ అంటే అస్సలు నచ్చదని, అలాంటి వ్యక్తితో సినిమా ఎలా చేశానో తనకి షాకింగ్ గా ఉందని తెలిపింది. ఒకసారి రాజ్ తరుణ్ కారులో వెళ్తుంటే అతనికి యాక్సిడెంట్ కావాలని కోరుకున్నానని ఈమె రాజ్ తరుణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అలా ఎందుకు కోరుకున్నారనే విషయాన్ని చెబుతూ.. ఒకసారి ఇంటర్వ్యూకి పిలిచి చాలా సేపు వెయిట్ చేయించారని, వెయిట్ చేసినా ఇంటర్వ్యూ ఇవ్వకుండా డబ్బింగ్ కరెక్షన్ ఉందని అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపింది. దీంతో తాను అలా కోరుకున్నానని ఆమె తెలిపింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now