Anveshi Jain : నాకు అవి పెద్ద‌గా ఉండ‌డంతో.. కొంద‌రు చెడుగా మాట్లాడేవారు : అన్వేషి జైన్

August 26, 2022 10:17 PM

Anveshi Jain : అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్లను లోబర్చుకునే సంస్కృతి మన తెలుగు పరిశ్రమలోనే కాదు ఇతర భాష పరిశ్రమలలో కూడా ఉంది. తెలుగులోనే కాదు అన్ని ఇండస్ట్రీల‌లో కూడా మహిళలు లైంగిక వేధింపులతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతకాలంలో చిత్ర పరిశ్రమ ఏదైనా సరే క్యాస్టింగ్ కౌచ్ అన్న‌ది కామ‌న్ విషయం అయిపోయింది. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నా అది కేవ‌లం నాలుగు గోడలకు మాత్రమే పరిమితమై ఉండేది. అయితే ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయిందని చెప్ప‌వచ్చు.

మీ టూ ఉద్య‌మాలు వెలుగులోకి రావ‌డంతో ఎవ్వ‌రూ కూడా వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. విద్యాబాలన్, రాధికా ఆఫ్టే, కంగ‌నా ర‌నౌత్ త‌దిత‌ర బాలీవుడ్ అగ్రస్థాయి హీరోయిన్స్  మాత్రమే కాకుండా అలనాటి నటి జమున దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్న‌ చిన్నా చిత‌కా హీరోయిన్లు అంద‌రూ కూడా కాస్టింగ్ కౌచ్‌పై ఓపెన్ గా మాట్లాడుతూ తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల‌ గురించి చెప్పుకొస్తున్నారు. ఇక ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద ఉద్య‌మంగా మారిపోయింది.

Anveshi Jain told about her life how she faced problems
Anveshi Jain

ఈ క్రమంలో తాజాగా మరో హీరోయిన్ ఈ లిస్ట్ లో చేరింది. మాస్ మ‌హ‌రాజ్‌ రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించిన అన్వేషి జైన్ కూడా ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అవ్వటం విశేషం. నేను ముందు మోడ‌లింగ్‌లో ప‌నిచేసి ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో ప‌లు సంఘ‌ట‌న‌లు ఎదుర్కొన్నాన‌ని చెప్పింది. తాను సినిమా ఆడిష‌న్స్‌ కోసం వెళితే కొంద‌రు ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌న‌పై అస‌భ్య‌క‌ర‌మైన కామెంట్లు చేయ‌డంతోపాటు నానా విధాలా ఇబ్బందులు పెట్టేవారని విచారం వ్యక్తం చేసింది.

ఓ సారి సినిమా ఆఫ‌ర్ ఉంద‌ని తెలుసుకొని ఒక స్టార్ డైరెక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళితే.. ఆఫ‌ర్ వంకతో నా శ‌రీరంపై అస‌భ్య‌క‌రంగా ట‌చ్ చేయ‌డంతోపాటు చాలా నీచంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని.. అయితే త‌న‌కు అసలు విషయం అర్థ‌మై తాను అక్క‌డ నుంచి వెళ్లిపోయాన‌ని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన ఎద భాగాలు కాస్త పెద్ద‌గా ఉండ‌డంతో వాటి గురించి కూడా కొంద‌రు ఇండ‌స్ట్రీ వాళ్లు చెడుగా మాట్లాడటం వలన ఎన్నో ఇబ్బందులు, అవ‌మానాలు ఎదుర్కొని అన్నింటికి తట్టుకుంటూ త‌న‌కు తానే స‌ర్ది చెప్పుకుంటూ ఈ రోజు ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డ్డాన‌ని అన్వేషి చెప్పడం జరిగింది. ఇక అన్వేషి జైన్ తాజాగా తెలుగులో కమిట్మెంట్ అనే సినిమాలో కూడా కీల‌క పాత్ర పోషించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న మేర ఫలితాల‌ను సాధించలేక పోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment