Ante Sundaraniki : నాని అంటే సుంద‌రానికి మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

June 22, 2022 9:31 PM

Ante Sundaraniki : నాచుర‌ల్ స్టార్ గా పేరుగాంచిన నాని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పుడు అనే చిత్రాలు హిట్ అవ‌డంతో స్టార్ హీరోగా కొన‌సాగుతున్నాడు. ఇక నాని లేటెస్ట్‌గా న‌టించిన అంటే సుంద‌రానికి మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయిన‌ప్ప‌టికీ సినిమాకు పెద్ద‌గా క‌లెక్ష‌న్లు రాలేద‌నే చెప్పాలి.

ఇక ఈ మూవీకి వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఇందులో నానికి జోడీగా న‌జ్రియా ఫ‌హాద్ న‌టించింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ త్వ‌ర‌లోనే ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు గాను డిజిట‌ల్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాను జూలై 8వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయ‌నున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయలేదు. క‌నుక తేదీ మారే చాన్స్ అయితే ఉంది. లేదంటే అదే తేదీన కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యేందుకు అవ‌కాశాలు కూడా ఉన్నాయి.

Ante Sundaraniki movie will be releasing on OTT platfrom Netflix
Ante Sundaraniki

ఇక ఇందులో రోహిణి, న‌రేష్‌, న‌దియా, రాహుల్ రామ‌కృష్ణ‌, పృథ్వి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించ‌గా.. వివేక్ సాగ‌ర్ సంగీతం అందించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now