Ante Sundaraniki : అంటే సుంద‌రానికీ.. మూవీ.. థియేట‌ర్ల‌లో ఫ్లాప్.. ఓటీటీలో హిట్‌..!

July 12, 2022 6:47 PM

Ante Sundaraniki : నాచుర‌ల్ స్టార్ నాని, నజ్రియా న‌జీమ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన మూవీ.. అంటే సుంద‌రానికీ.. ఈ మూవీ జూన్ 10వ తేదీన థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సాధించిన‌ప్ప‌టికీ థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కుల‌ను ర‌ప్పించ‌లేక‌పోయింది. దీంతో ఈ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని సాధించ‌లేక‌పోయింది. రూ.30 కోట్ల‌తో సినిమా తీస్తే రూ.50 కోట్లు వ‌స్తాయ‌ని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ రూ.39 కోట్ల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

ఇక ఈ మూవీని ఓటీటీలో ఈ మ‌ధ్యే రిలీజ్ చేశారు. అయితే థియేట‌ర్ల‌లో ఈ మూవీ ఫ్లాప్ అయింది. కానీ ఓటీటీలో మాత్రం హిట్ అయింది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 10వ తేదీన రిలీజ్ కాగా.. ప్ర‌స్తుతం ఈ మూవీ ఆ యాప్‌లో టాప్ 10 మూవీల్లో ఒక‌టిగా దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే అంటే సుంద‌రానికీ.. మూవీకి భారీ ఎత్తున స్పంద‌న ల‌భిస్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే థియేట‌ర్ల‌లో క‌న్నా కొన్ని సినిమాల‌కు ఓటీటీల్లోనే ఎక్కువ ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

Ante Sundaraniki flop in theatres hit in OTT
Ante Sundaraniki

కాగా అంటే సుంద‌రానికీ.. మూవీకి వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. మైత్రి మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు. వివేక్ సాగ‌ర్ సంగీతం అందించారు. అయితే ఈ మూవీ ర‌న్‌టైమ్ కాస్త ఎక్కువే. అందువ‌ల్లే ఈ మూవీని చూసేందుకు థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రాలేద‌ని అంటున్నారు. ఏది ఏమైనా.. థియేట‌ర్ల‌లో ఫ్లాప్ అయినా.. ఓటీటీలో మాత్రం ఈ మూవీ దూసుకుపోతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక నాని త్వ‌ర‌లోనే ద‌స‌రా అనే మూవీతో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now