Nagarjuna : అమలను నాగార్జున పెళ్లి చేసుకోవడం ఏఎన్ఆర్‌కు అందుకే ఇష్టం లేదా..?

August 16, 2022 2:22 PM

Nagarjuna : అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున హీరోగా సూపర్ సక్సెస్ అయ్యారు. నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో అందరి ప్రశంసలు అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సమానంగా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సొంత చేసుకున్నాడు. తండ్రి స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను అన్న అక్కినేని వెంకట్ తో కలిసి చూసుకుంటున్నాడు. అన్నపూర్ణ బ్యానర్ కి ఒక బ్రాండ్ ఉంది. ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాలన్ని ఫ్యామిలీస్ ని బాగా ఆకట్టుకుంటాయని ఒక పేరుంది.

శివ సినిమాతో రాం గోపాల్ వర్మలాంటి వారిని ఇండస్ట్రీకి పరిచయం చేసి తండ్రిలాగే కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయడం లాంటివి ఎన్నో చేశారు నాగార్జున‌. నాగేశ్వర రావు, నాగార్జుల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. ప్రతి విషయంలోనూ తండ్రి మాట జవదాటడు నాగార్జున. అలాంటిది తన పెళ్ళి విషయంలో మాత్రం తండ్రికి ఎదురు నిలబడ్డాడు. నాగార్జున ముందుగా దివంగత లెజెండ్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నారు. అయితే నాగార్జున సినిమాల్లోకి రావడానికి ముందే శ్రీలక్ష్మితో వివాహమైంది. అప్పటికే ఈ దంపతులకు నాగచైతన్య జన్మించాడు. ఆ తర్వాత ఆమెతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్న నాగార్జున తనతో పాటు శివ సినిమాలో హీరోయిన్‌ గా నటించిన అమలను పెళ్లి చేసుకున్నారు.

ANR not agreed for Nagarjuna and Amala marriage first
Nagarjuna

అయితే అమల‌ను వివాహం చేసుకోవడం ఏఎన్ఆర్ కు ఇష్టం లేదట. సినిమా రంగంలో ఉన్న వారి వ్యక్తిగత జీవితాలు సక్రమంగా ముందుకు సాగవ‌ని ఆయ‌న‌ నమ్మేవారు. పెళ్లయి విడాకులు తీసుకున్న నాగార్జున.. సినిమా రంగంలో ఉన్న అమ్మాయిని మళ్లీ పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అన్న ఆందోళ‌న‌తో ఉన్నార‌ట‌. అందుకే ఏఎన్ఆర్ అమలను తన ఇంటి కోడలుగా స్వీకరించేందుకు ఇష్టపడలేదట. దీనికి తోడు అమల తెలుగు అమ్మాయి కాదు. దీంతో నాగార్జునను ఎలా అర్థం చేసుకుంటుందో అన్న అనుమానం కూడా ఏఎన్ఆర్ కు ఉండేదట. అయితే చివరకు నాగార్జున ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకున్నారు. ఆ తర్వాత అమల అక్కినేని ఫ్యామిలీ విలువలకు అనుగుణంగా నడుచుకుంటూ ఆ ఇంటి కోడలిగా ఒదిగిపోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now