Karate Kalyani : కరాటే కల్యాణి గొడవలో ఊహించని ట్విస్ట్‌.. ఆమెపై ఇంకో వ్యక్తి ఫిర్యాదు..!

May 14, 2022 7:56 PM

Karate Kalyani : యూట్యూబర్‌ శ్రీకాంత్‌ రెడ్డి ప్రాంక్‌ వీడియో పేరిట అమ్మాయిలు, ఆంటీలను అసభ్యంగా చూపిస్తున్నాడని ఆరోపిస్తూ నటి కరాటే కల్యాణి తాజాగా అతనిపై దాడి చేసిన విషయం విదితమే. అయితే ఈ గొడవలో శ్రీకాంత్‌ రెడ్డి, కల్యాణి ఇద్దరూ ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే గొడవ పెద్దది కావడంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. అయితే అతనిదే తప్పని కల్యాణి అంటుంటే.. ఆమెదే తప్పని శ్రీకాంత్‌ అంటున్నాడు. తనను రూ.1 లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేసిందని.. లేదంటే వేధింపులకు పాల్పడుతున్నావంటూ కేసు పెడతానని.. మహిళా సంఘాలకు చెబుతానని.. కల్యాణి తనను బెదిరించిందని.. చివరకు ఆమె వద్ద ఉన్న ఓ వ్యక్తి రూ.70వేలు ఇస్తే అంతా సెటిల్‌ చేస్తానని చెప్పాడని.. శ్రీకాంత్‌ తెలిపాడు.

ఇక కల్యాణి వెర్షన్‌ మాత్రం మరోలా ఉంది. ఒక బంధువుల అమ్మాయి తన వద్దకు వచ్చి శ్రీకాంత్‌ గురించి చెప్పిందని.. దీంతో అతన్ని పద్ధతి మార్చుకోవాలని.. ప్రాంక్‌ వీడియోలు చేయొద్దని.. అమ్మాయిలు, ఆంటీలను అలా అసభ్యంగా చూపించడం మానుకోవాలని.. అతనికి చెప్పానని కల్యాణి తెలిపారు. అయితే అతను మాత్రం పొగరుగా మాట్లాడుతూ.. తాను ఒక్కో అమ్మాయికి లేదా ఆంటీకి రూ.15వేలు ఇచ్చి వీడియోలు చేయించుకుంటున్నానని.. అందులో మీకు వచ్చిన ఇబ్బందేమి ఉందని.. అతను ప్రశ్నించాడని కల్యాణి అన్నారు. అయితే అతను రూ.2 లక్షలు ఇస్తాను.. మీరు కూడా అలాంటి వీడియోలు చేయవచ్చు కదా.. అని అడిగాడని.. అందుకనే కోపం వచ్చి కొట్టానని.. అతన్ని విడిచిపెట్టేది లేదని కల్యాణి ఆరోపించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ బాగానే జరిగింది. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఇంకో వ్యక్తి కల్యాణిపై ఫిర్యాదు చేశాడు.

another man complained on Karate Kalyani
Karate Kalyani

కరాటే కల్యాణి తనను బ్లాక్‌ మెయిల్‌ చేసిందని ఆరోపిస్తూ.. గోపీకృష్ణ అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో ఓ ఇంటి విషయంలో కల్యాణి తనను బెదిరించిందని.. రూ.3.50 లక్షలు వసూలు చేసిందని తెలిపాడు. ఇవ్వకపోతే పురుగుల మందు తాగిన వీడియోను పంపి తమను భయపెట్టిందని.. అందుకనే డబ్బులు ఇచ్చానని.. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని గోపీకృష్ణ తాజాగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు ట్విట్టర్‌ వేదికగా ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు కొత్త మలుపు తిరిగింది. అయితే అసలు ఈ ఇంటి వ్యవహారం ఏమిటి.. దీనికి కల్యాణితో సంబంధం ఏంటి ? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇక దీనిపై కల్యాణి కూడా స్పందించాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now