Anjali : ఆస్తులు త‌క్కువ‌గా ఉండ‌డం కూడా అంజ‌లి త‌ప్పేనా..? ఇంత‌కీ ఆమె ఆస్తులు ఎంత‌..?

August 29, 2022 10:38 AM

Anjali : తెలుగమ్మాయి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంజలి తమిళ సినిమా షాపింగ్ మాల్ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ సినిమా తర్వాత తమిళ్‌తో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది అంజలి. హోమ్లీ పాత్రలతో అందరినీ ఈ భామ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2013లో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన అంజలి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో అంజలికి మంచి పేరొచ్చింది.

తమిళ హీరో జై తో చాలా కాలం ఆమె సహజీవనం చేసింది. ఆ తర్వాత ఏమైందో కానీ వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. చాలా రోజుల తర్వాత అంజలికి తెలుగులో ఐటెం సాంగ్ లో అవకాశం వచ్చింది. నితిన్ హీరోగా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో అంజలి ఐటమ్ సాంగ్ ఒక ఊపు పేసింది. రా రా రెడ్డి అనే పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం అంజలి ఆస్తుల వివరాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంజలి దాదాపుగా 2006 నుంచి 15 ఏళ్ళకి పైగా నటిగా కొనసాగుతోంది. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో కొనసాగిన నటి భారీగానే ఆస్తులు కూడబెట్టుకొని ఉంటుంది. కానీ అంజలికి ఆస్తులు అంతగా లేవట. ఆమె ఆస్తులపై ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Anjali assets news viral netizen troll her
Anjali

చెన్నై, హైదరాబాద్ నగరాల్లో అంజలి మొత్తం ఆస్తుల విలువ రూ.10 కోట్లు ఉన్నాయట. దాదాపు 15 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతున్న నటి ఆస్తులు ఇంతేనా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒక్కో మూవీకి దాదాపు రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకునే అంజలి ఆస్తుల విలువ ఇంతేనా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అది కూడా ఆమె తప్పేనా అంటూ కొంతమంది ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. అంజలి పిన్నితో ఆస్తికి సంబంధించిన గొడవలు చాలా రోజుల క్రితం మొదలయ్యాయి. దీని గురించి తేల్చుకునేందుకు వాళ్ళు ఏకంగా కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఈ ఇష్యూ గురించి స్పందిస్తూ ఎవరినీ నమ్మకూడదని డిసైడ్ అయినట్లు అంజలి గతంలో తెలిపింది. ప్రస్తుతం అంజలి శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ RC15 చిత్రంలో నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now