Android : అల‌ర్ట్‌.. ఈ యాప్స్ మీ ఫోన్ల‌లో ఉంటే వెంట‌నే తీసేయండి.. లేదంటే అంతే సంగ‌తులు..!

October 1, 2021 9:40 PM

Android : ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ప్లే స్టోర్‌లో ఉన్న మాల్‌వేర్ యాప్స్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటూనే ఉంది. అయిన‌ప్పటికీ అందులో వ‌స్తున్న హానిక‌ర యాప్‌ల‌కు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ రక‌మైన మాల్‌వేర్ కొన్ని యాప్స్ ద్వారా ఫోన్ల‌కు వ్యాపిస్తోంది. దీంతో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఐటీ సెక్యూరిటీ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Android : అల‌ర్ట్‌.. ఈ యాప్స్ మీ ఫోన్ల‌లో ఉంటే వెంట‌నే తీసేయండి.. లేదంటే అంతే సంగ‌తులు..!

గ్రిఫ్ట్ హార్స్ అనే ఓ హానిక‌ర్ మాల్‌వేర్ ప్ర‌స్తుతం కొన్ని యాప్స్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు వ్యాప్తి చెందుతుంద‌ని గూగుల్ తెలియ‌జేసింది. అందులో భాగంగానే ఆ మాల్‌వేర్‌తో సంబంధం క‌లిగిన 136 యాప్స్‌ను గూగుల్ త‌న ప్లేస్టోర్ నుంచి తొల‌గించింది. ఇక ఆ జాబితాలో ఉన్న యాప్స్‌ను ఎవ‌రైనా ఇప్ప‌టికే ఫోన్ లో ఇన్‌స్టాల్ చేసి ఉంటే వెంట‌నే తొల‌గించాల‌ని గూగుల్ తెలియ‌జేసింది.

ఆ యాప్స్‌లో.. ఫోటో ల్యాబ్‌, మై చాట్ ట్రాన్స్ లేట‌ర్‌, లాక‌ర్ టూల్‌, కాల్ రికార్డ‌ర్ ప్రొ, సేఫ్ లాక్‌, ఫేస్ అన‌లైజ‌ర్‌, ఫిట్ నెస్ ట్రైన‌ర్‌, మై లొకేట‌ర్ ప్ల‌స్‌, జోడియాక్ హ్యాండ్‌, లూడో క్లాసిక్‌, యూ ఫ్రేమ్‌, ఫైండ్ కాంటాక్ట్ వంటి కొన్ని యాప్స్ ఉన్నాయి. వీటిని చాలా మంది వాడుతున్నార‌ని, వెంట‌నే వీటిని ఫోన్ల నుంచి తొల‌గించాల‌ని సూచిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now