Anchor Suma : ఎవడ్రా నీకు ఆంటీ అంటూ.. నరేష్ పై యాంకర్ సుమ ఫైర్..

September 15, 2022 12:14 PM

Anchor Suma : యాంకర్‌ సుమ.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు కూడా సుమ బాగా సుపరిచితురాలు. పుట్టి పెరిగింది కేర‌ళ‌లో అయినా టాలీవుడ్ బుల్లితెర‌పై రారాణిలా ఓ వెలుగు వెలుగుతుంది. తన మాటలు, పంచ్‌లు, కామెడీ టచ్‌తో యాంకర్‌గా టాలీవుడ్‌లో ఆమె చక్రం తిప్పుతున్నారు. యాంకర్లు ఎంతమంది ఉన్నా సినిమా కార్య‌క్ర‌మాలు, ఆడియో ఫంక్ష‌న్స్‌, ఈవెంట్స్‌ అంటే యాంక‌ర్‌గా సుమ ఉండాల్సిందే అనేలా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఒకప్పుడు జీ తెలుగు, స్టార్ మా, ఈటీవీ ఇలా అన్నింట్లోనూ సుమ కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క ఈటీవీలోనే కనిపిస్తోంది.

అది కూడా క్యాష్ షోను మాత్రమే చేస్తోంది. ప్రతి శనివారం సుమ తన అభిమానులను క్యాష్ షో ద్వారా పలకరిస్తోంది. ఒకప్పుడు గెస్టులను పిలవడంలోనూ వైవిధ్యత ఉండేది. కానీ ఇప్పుడు సినిమా ప్రమోషన్లకే క్యాష్ ప్రోగ్రాం ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుంది. గత వారం బ్రహ్మాస్త్రం టీం గెస్టుగా వచ్చింది. మొదటిసారిగా రాజమౌళి ఇలా ఓ షోకు వచ్చాడు. దాంతో ఒక్కసారిగా క్యాష్ షో నేషనల్ టాపిక్ అయింది. తాజాగా క్యాష్ షోలోకి జబర్దస్త్ గ్యాంగ్ వచ్చింది. గడ్డం నవీన్, బాబు, బుల్లెట్ భాస్కర్, నరేష్ ఇలా కమెడియన్ల గ్యాంగ్ అంతా వచ్చారు. అయితే ఇందులో నరేష్ మీద సుమ పంచులు వేస్తూ నవ్వుల పువ్వులు పూయించింది.

Anchor Suma angry on jabardasth naresh for his comments
Anchor Suma

మీ అందరికీ రూల్స్ తెలుసు కదా ? అని సుమ అంటే.. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పండి అని నరేష్ అంటాడు. నువ్వే ఇంత పాత బడుతున్నావ్ ఇంకా కొత్తగా ఏం చెప్పాలి అంటుంది సుమ. నీవు ఇంతే ఉన్నావ్ కానీ వయసు మాత్రం బాగానే పెరుగుతోంది అని సుమ కౌంటర్ వేస్తే.. వయసు కాదు మేడం.. అనుభవం అని నరేష్ నాటీగా అంటాడు. మరో సందర్భంలో సుమ ఓ స్కిట్ చేసింది. అందులో ఓకే ఆంటీ అని నరేష్ అంటాడు. ఎవడ్రా నీకు ఆంటీ.. ఇలాంటి కామెడీలు చేయొద్దని చెప్పాను కదా ? అని సుమ కౌంటర్ ఇస్తుంది. దీంతో నరేష్ సైలెంట్ అయిపోతాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now