Anchor : ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తూ ఉండటంతో.. సినిమా సెలబ్రిటీలు, పాపులర్ టీవీ సెలబ్రిటీలు సైతం అభిమానులకు నిత్యం టచ్‌లో ఉంటున్నారు. తమ లేటెస్ట్ అప్‌డేట్స్‌తోపాటు పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు తమ చిన్నప్పటి ఫోటోలను కూడా అప్పుడప్పుడూ షేర్ చేస్తూ చూసేవారిని ఆశ్చర్యానికి లోను చేస్తున్నారు. వారు షేర్ చేసిన ఫోటోలు క్షణాల్లో నెటింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. మన హీరోయిన్స్ మాత్రమే కాదు. మన బుల్లితెర నటులు, పాపులర్ యాంకర్ లు సైతం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎంతో దగ్గరవుతున్నారు.
ఇప్పుడు ప్రస్తుతం ఒక సెలబ్రిటీ పోస్ట్ చేసిన ఒక ఫోటో నెటింట్లో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో చూడ్డానికి ముద్దుగా ఉన్న బూరె బుగ్గల చిన్నది ఎవరో గుర్తుపట్టండి. ఈమె మన తెలుగు టాప్ యాంకర్ లలో ఒకరు. ఎంత గొప్ప కమెడియన్ కైనా తనదైన శైలిలో పంచులు వేస్తూ నోరు మూయిస్తుంది. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడానికి కూడా వెనుకాడదు. ఈమెను గుర్తు పట్టాలంటే మీకు ఇంకో చిన్న క్లూ.. ఈమె అల్లు అర్జున్ చెల్లెలుగా ఒక చిత్రంలో కూడా నటించింది. ఇంకా గుర్తుపట్టలేదా..
ఆవిడే మన మాటల సునామి శ్రీముఖి. శ్రీముఖి తన అందం, అభినయంతో అటు వెండితెర ప్రేక్షకులను, గల గల మాట్లాడే వాక్చాతుర్యంతో ఇటు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, చంద్రిక, జెంటిల్ మ్యాన్, మాస్ట్రో వంటి ఎన్నో చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం శ్రీముఖి.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోళా శంకర్ చిత్రంలో కూడా నటిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…