Anchor Jhansi : సినీ ఇండస్ట్రీలో నటిగా, యాంకర్ గా ఝాన్సీ సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటోంది. బుల్లితెరపై యాంకర్ ఝాన్సీ మొదట్నుంచి పలు వివాదాలకు స్పందిస్తుంది. ముఖ్యంగా సమాజంలో జరిగే విషయాలపై ఝాన్సీ రెస్పాన్డ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత పలు కామెంట్స్ కి గురవుతుంటుంది.
రీసెంట్ గా ఆమె మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్ లో ఝాన్సీ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ప్రజలు ఎలాంటి వార్తలు కావాలనుకుంటారో అవి చూపించడం లేదని బలవంతంగా వారు చెప్పాలనుకున్న వార్తల్నే చెబుతున్నారనేలా ఓ సామెత చెప్పారు.
అనగనగా ఓ ఎద్దు.. దానికో పుండు, ఎద్దు పుండు కాకికి ముద్దు.. కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచి పొడిచి తిన్నాయి. పుండును పెద్దది చేశాయి.. ఎద్దు బుసలు కొట్టి రెచ్చిపోయింది. కాకులు గోల పెంచేస్తాయంటూ ఓ పోస్ట్ చేశారు. సెలెబ్రిటీలకు మైకులు పెట్టి మరీ మురికి గొట్టాలను జనాల ఇళ్లల్లోకి వెళ్ళేలా చేయడానికి అంతకు మించి మంచి వార్తలు లేవా.. అంటూ మండిపడ్డారు.
సెలెబ్రిటీల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు జరిగినా.. అవి పెటాకులైనా లేదా మరే వివాదాలు జరిగినా అదే అసలు సందడి అనుకుని హడావిడి చేస్తున్న కాకుల్లారా.. ప్రజా ప్రయోజన వార్తలంటే ఏంటో ఒకసారి డిక్షనరీలో చూడండి.. అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. మీడియాపై యాంకర్ ఝాన్సీ చేసిన వ్యాఖ్యల్ని కొంతమంది నెటిజన్లు సపోర్ట్ చేస్తుంటే.. మరికొంతమంది మండిపడుతున్నారు. సమంత విషయంపై అత్యుత్సాహం చూపడం వల్లనే ఆమె ఇలా కామెంట్ చేసి ఉంటుందని అంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…