Anchor Jhansi : కాకుల్లారా అంటూ.. మీడియాపై మండిప‌డ్డ ఝాన్సీ.. ఎందుక‌లా అనేసింది?

October 11, 2021 1:21 PM

Anchor Jhansi : సినీ ఇండస్ట్రీలో నటిగా, యాంకర్ గా ఝాన్సీ సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటోంది. బుల్లితెరపై యాంకర్ ఝాన్సీ మొదట్నుంచి పలు వివాదాలకు స్పందిస్తుంది. ముఖ్యంగా సమాజంలో జరిగే విషయాలపై ఝాన్సీ రెస్పాన్డ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత పలు కామెంట్స్ కి గురవుతుంటుంది.

Anchor Jhansi controversial comments on media

రీసెంట్ గా ఆమె మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్ లో ఝాన్సీ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ప్రజలు ఎలాంటి వార్తలు కావాలనుకుంటారో అవి చూపించడం లేదని బలవంతంగా వారు చెప్పాలనుకున్న వార్తల్నే చెబుతున్నారనేలా ఓ సామెత చెప్పారు.

అనగనగా ఓ ఎద్దు.. దానికో పుండు, ఎద్దు పుండు కాకికి ముద్దు.. కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచి పొడిచి తిన్నాయి. పుండును పెద్దది చేశాయి.. ఎద్దు బుసలు కొట్టి రెచ్చిపోయింది. కాకులు గోల పెంచేస్తాయంటూ ఓ పోస్ట్ చేశారు. సెలెబ్రిటీలకు మైకులు పెట్టి మరీ మురికి గొట్టాలను జనాల ఇళ్లల్లోకి వెళ్ళేలా చేయడానికి అంతకు మించి మంచి వార్తలు లేవా.. అంటూ మండిపడ్డారు.

సెలెబ్రిటీల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు జరిగినా.. అవి పెటాకులైనా లేదా మరే వివాదాలు జరిగినా అదే అసలు సందడి అనుకుని హడావిడి చేస్తున్న కాకుల్లారా.. ప్రజా ప్రయోజన వార్తలంటే ఏంటో ఒకసారి డిక్షనరీలో చూడండి.. అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. మీడియాపై యాంకర్ ఝాన్సీ చేసిన వ్యాఖ్యల్ని కొంతమంది నెటిజన్లు సపోర్ట్ చేస్తుంటే.. మరికొంతమంది మండిపడుతున్నారు. స‌మంత విష‌యంపై అత్యుత్సాహం చూప‌డం వ‌ల్ల‌నే ఆమె ఇలా కామెంట్ చేసి ఉంటుంద‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now