Anasuya : ఇదెక్కడి న్యాయం సర్.. అంటూ మంత్రి కేటీఆర్ కు అనసూయ ట్వీట్..!

October 30, 2021 11:11 AM

Anasuya : బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం తన కెరీర్లో ఎంతో బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా పలు అంశాలపై స్పందిస్తూ తన దైన శైలిలో సెటైర్లు వేయడం చేస్తుంటుంది. సోషల్ మీడియా వేదికగా తన గురించి వచ్చే నెగెటివ్ కామెంట్స్ ను తిప్పికొడుతూ ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న అనసూయ తాజాగా ట్విట్టర్ ద్వారా మరొక విషయంపై స్పందిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసింది.

Anasuya tweet about sending children to schools to ktr

ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే పిల్లలను స్కూలుకు పంపించాలని తల్లిదండ్రులపై అధిక ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇదిలా ఉండగా పిల్లలకు పాఠశాలలో ఎలాంటి ప్రమాదం జరిగినా స్కూల్ యాజమాన్యం బాధ్యత కాదని.. తల్లిదండ్రుల నుంచి డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు తగ్గినప్పటికీ అక్కడక్కడ కేసులు నమోదు అవుతూ ఉన్నాయి.

అయితే కరోనా కేసులు తగ్గడంతో తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అలాగే వాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలోనే ఈ విషయంపై అనసూయ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సర్.. కరోనా కేసుల కారణంగా మనం లాక్ డౌన్ నిర్వహించాము. అలాగే దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. మరి కరోనా వ్యాక్సిన్ తీసుకోని చిన్నారుల పరిస్థితి ఏంటి ? పిల్లలకు ఏమైనా జరిగితే అందుకు తాము బాధ్యులు కామని స్కూల్ యాజమాన్యాలు తెలియజేస్తున్నాయి. ఇదెక్కడి న్యాయం సర్.. అంటూ ఆమె మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now