Anasuya : జ‌బ‌ర్ద‌స్త్‌ను విడిచిపెట్టింది అందుకే.. దిమ్మ తిరిగిపోయే నిజాలు చెప్పిన అన‌సూయ‌..

August 14, 2022 11:12 AM

Anasuya : దాదాపు పదేళ్లుగా నిర్విరామంగా సాగుతున్న జబర్థస్త్ కామెడీ షో నుంచి వరుసగా.. ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. రీసెంట్ గా యాంకర్ అనసూయ కూడా జబర్థస్త్ ను వీడింది. సక్సెస్ ఫుల్ జర్నీ చేసిన అనసూయ.. రీసెంట్ గా యాంకర్ స్థానం నుంచి తప్పుకుంది. అయితే ఆమె ఎందుకు జబర్ద‌స్త్ ను వదిలేసింది.. అన్న విషయంలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. వాటిపై ఎప్పుడూ స్పందించలేదు అనసూయ. ఈ విషయంపై ఫస్ట్ టైమ్ ఆమె నోరు విప్పింది.

జబర్దస్త్ నుంచి బయటకు రావాలనే ప్రాసెస్ రెండేళ్ల నుంచి జరుగుతోందని చెప్పుకొచ్చింది. మల్లెమాల ప్రొడక్షన్స్ హౌస్‌ మంచి అవకాశాలను ఇచ్చింది.. అక్కడ మంచి మంచి వ్యక్తులు ఉన్నారు అంటూ గొప్పగా చెప్పింది. అదే సందర్బంలో చాలా వివాదాలు కూడా వచ్చాయి. నాకెందుకో అనిపిస్తుంది.. జబర్దస్త్‌లో ఉన్న వాళ్లకి దిష్టి తగిలిందేమో అని.. అందుకే ఇలా అయ్యింది.. అంతా కలిసి ఫ్యామిలీలా ఉండేదంటూ ఎమోషనల్ అయింది. జబర్దస్త్ తన లైట్ హార్టెడ్ షో.. కొన్ని సందర్భాల్లో లైన్ క్రాస్ చేస్తుంటారని చెప్పుకొచ్చింది.

Anasuya told real reason why she left Jabardasth
Anasuya

తనకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయని, షూటింగ్ కోసం అడ్జెస్ట్‌మెంట్ అడిగినప్పుడు తనకే గిల్టీగా అనిపిస్తుందని చెప్పింది. అంతమంది చేస్తున్నారు.. నా కోసం షెడ్యుల్ మార్చడం కరెక్ట్ కాదని నాకే అనిపించిందంటూ ఎమోషనల్ అయింది. తొమ్మిదేళ్లు జబర్దస్త్ యాంకర్‌గా ఉన్నా.. నాకు ఆ షో బోర్ కొట్టలేదు. నేను ఎవర్నీ నిందించాల‌ని అనుకోవ‌డం లేదు.. అని చెప్పుకొచ్చింది అన‌సూయ‌.

బాడీ షేమింగ్.. వెకిలి చేష్టలు నాకు నచ్చవు. వాటిపై నేను రియాక్షన్స్‌ ఇచ్చే ఉంటాను కానీ అది వేయరు. కొంతమంది నన్ను చాలా మంచిదాన్ని అని అంటుంటారు. ఇంకొంతమంది పొగరని అంటారు.. అదీ నేనే.. ఇదీ నేనే.. ఆ విషయంలో నేను సిగ్గుపడడం లేదు. నాగబాబు వెళ్లిపోయారు.. రోజా వెళ్లిపోయారు.. ఇంకా చాలామంది వెళ్లిపోయారు కదా.. అని నేను జబర్దస్త్‌‌ని వదిలేశాననడం నిజం కాదు. నాగబాబు, రోజా.. నేను మేమంతా మొదటి నుంచి ఉన్నాం.. అప్పటికి సుడిగాలి సుధీర్ వాళ్లు కూడా లేరు. వాళ్లు వెళ్లిపోయారు కదా అని వెళ్లిపోవడానికి నేనేం గొర్రెల మంద టైప్ కాదు.

నాకు టీఆర్పీ గురించి పెద్దగా లెక్కలు తెలియవు. నేను స్టార్టింగ్‌లో చేసినప్పుడు హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ వచ్చిందట. నాకు టీఆర్పీతో సంబంధం లేదు. నేను వాటిని పట్టించుకోను అని చెప్పుకొచ్చింది అనసూయ. ఇక జబర్ద‌స్త్ మానేసిన తరువాత ఫస్ట్ టైమ్ మనసు విప్పి మాట్లాడిన అనసూయ.. అసలు నిజాల‌ను వెల్లడించింది. ఇక తాను సినిమాలపై ఫోకస్ పెట్టబోతున్నట్ట చెప్పకనే చెప్పింది. స్పెషల్ పాత్రలతో సినిమాల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సాధించింది అనసూయ. ఇక మూవీ కెరీర్ ను పరుగులు పెట్టించబోతున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now